Kitchen Hacks: రాగి పాత్రలు నల్లగా మారిపోయాయా?.. శుభ్రం చేయడానికి ఈ చిట్కాలను అనుసరించండి
కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా తినే ఆహారంలో మాత్రమే కాదు వంట చేసే పాత్రల్లో కూడా మార్పులు వచ్చాయి. పురాతన కాలంలో రాగి, ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే.. వాటి స్థానంలో ప్లాస్టిక్, స్టీల్ వంటివి వచ్చి చేరాయి. అయితే మళ్ళీ క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. దీంతో పాత పద్ధతులవైపు పయనం అవుతున్నారు. అనేక వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకు కారణంమైన వాటికీ చెక్ పెట్టి రాగి , మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు.