Neem for Monsoon: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి భయపడుతున్నారా.. చింతయేలా దండగ.. వేప ఉందిగా అండగా..
ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.