ఇప్పుడున్న కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి. అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి.