Evening Snacks: ఈవినింగ్ స్నాక్స్‌గా మరమరాల మిక్చర్.. షుగర్ పేషేంట్స్ సహా పిల్లలు పెద్దలకు బెస్ట్ ఆప్షన్.. తయారీ విధానం మీకోసం
ఆకలి వేస్తే చాలా మంది బిస్కెట్స్ ను తింటారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ టీ తో పాటు.. స్నాక్స్ గా బిస్కెట్స్ ను తిని హమ్మయ్య అనుకుంటారు. అయితే ఈ బిస్కెట్లలో పిండి, చక్కెర ఉంటాయి. ఆకలి అనిపించినప్పుడల్లా ఇలా బిస్కెట్లు తినడం శరీరానికి మంచిది కాదు. ఎక్కువగా బిస్కెట్స్ తినడం మలబద్దకానికి కూడా కారణమవుతుంది. కనుక మధ్యాహ్నం టీతో బిస్కెట్లు తీసుకునే బదులు ఈజీగా మరమరాలతో స్నాక్స్ చేసుకుని తినవచ్చు. ఇవి ఆకలిని తీరుస్తాయి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి..