IND Vs AUS: ఆ 3గురు టీమిండియా ఆటగాళ్లూ టెస్టులకు గుడ్‌బై.. లిస్టులో కోహ్లీ సహచరుడు.!

ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తోంది.

Ravi Kiran

|

Updated on: Feb 28, 2023 | 9:25 AM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 1వ తేదీ బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఇప్పుడు మరో టెస్ట్ మ్యాచ్ గెలిచిందంటే.. భారత్ సరాసరి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు వెళ్తుంది.

1 / 5
ఇదిలా ఉంటే.. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తోంది. మరి వారెవరో చూద్దాం.

2 / 5
టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ అత్యంత ప్రమాదకరమైన బౌలర్. జట్టుకు అవసరమైన సమయాల్లో బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. కానీ, అశ్విన్ వయసు ఇప్పుడు 36 ఏళ్లు. ఇక అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ముందు వరుసలో ఉన్నారు. అటు ఈ స్థానం కోసం కుల్దీప్ యాదవ్ కూడా ఎదురు చూస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ టెస్ట్ సిరీస్ అనంతరం అశ్విన్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది.

3 / 5
ఈ సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోనున్న మరో ఆటగాడు జయదేవ్ ఉనద్కత్. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 10 ఏళ్ల తర్వాత అవకాశం దక్కించుకున్న ఉనద్కత్ ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత మళ్లీ టీమిండియాకు ఉనద్కత్ ఎంపిక కావడం అనుమానమే. కాబట్టి అతను భారత్-ఆసీస్ టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.

4 / 5
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే మరో క్రికెటర్ ఉమేష్ యాదవ్. గతేడాది అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శన కనబరచడంతో మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమిండియాలో ఇప్పటికే మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి పేసర్లు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఉమేష్ జట్టులో చోటు దక్కించుకోకపోవచ్చు. తద్వారా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

5 / 5
Follow us