క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు ఒక ఆటగాడు 50 బంతుల్లో 100 పరుగులు చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతను మొదటి బంతికే అవుట్ అవుతుంటాడు. ఓజట్టు ఓడిపోతుందని భావిస్తే, గెలుస్తుంది. ఇలా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కో ఫార్మాట్ ప్రకారం ఆటగాళ్లు కూడా దానికి తగ్గట్టుగానే మారుతూ బ్యాటింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఒక ఫార్మాట్‌ను తమ ఫేవరేట్‌గా ఎంచుకుంటుంటారు. దానిలో అద్భుతంగా రాణిస్తారు. అయితే, కొంతమంది ప్లేయర్లు మాత్రం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగలు వర్షం కురిపిస్తుంటారు. అందరి అంచానాలను తప్పుగా నిరూపిస్తుంటారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి ఆటగాళ్లు 5గురు ఉన్నారు. తమ జోన్ నుంచి బయటపడి, వేరే ఫార్మాట్‌లోనూ ఊహించని విధంగా విజయం సాధించారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..