IND vs IRE: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. స్పెషల్ జాబితాలో చోటు..

Jasprit Bumrah: టీమ్‌ఇండియా తరపున రీఎంట్రీ ఇచ్చి తొలి ఓవర్ విసిరిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. తొలి ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

Venkata Chari

|

Updated on: Aug 19, 2023 | 9:33 AM

ఐర్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

1 / 8
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. టీమిండియాకు 140 పరుగుల సవాల్ విసిరింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్‌ను సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు వర్షం ఆగకపోవడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.

2 / 8
ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీతో పాటు సరిగ్గా 11 నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

3 / 8
నిజానికి టీమిండియా తరపున మొదట అటాక్ చేసిన బుమ్రా.. తొలి ఓవర్ లోనే 2 వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఆండీ బల్బిర్నీ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బుమ్రా తన రెండో బంతికి బల్బిర్నీ వికెట్ పడగొట్టడంలో సఫలమయ్యాడు.

4 / 8
ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి లోర్కాన్ టక్కర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. తొలి ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

5 / 8
దీంతో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

6 / 8
సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా బుమ్రా గత 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీని కారణంగా, బుమ్రా T20 ప్రపంచ కప్, IPL, WTC ఫైనల్‌లో కూడా ఆడలేదు.

7 / 8
ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా తన నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

8 / 8
Follow us