IND vs IRE: మలింగ ‘చెత్త రికార్డ్‌’ని బ్రేక్ చేసిన అర్ష్‌దీప్.. ఆ లిస్టులో అందరూ దిగ్గజ బౌలర్లే, కానీ..

IND vs IRE, 1st T20I: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వర్షం అడ్డురావడంతో డర్క్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్టోయ్ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. అయితే ఒక వికెట్ తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్ మాత్రం బౌలింగ్ దిగ్గజాలు ఉన్న ఓ చెత్త లిస్టులోకి చేరాడు.దిగ్గజ బౌలర్లను కలిగిన ఆ చెత్త లిస్టు ఏమిటో.. అర్ష్‌దీప్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 19, 2023 | 4:14 PM

IND vs IRE, 1st T20I: భారత్, ఐర్లాండ్ మధ్య శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే ఈ క్రమంలో అర్ష్‌దీప్ ఓ నో బాల్ కూడా వేశాడు. ఇదే అతన్ని చెత్త రికార్డ్‌ల్లో నిలిచేలా చేసింది.

1 / 5
ఐర్లాండ్‌పై అర్ష్‌దీప్ వేసిన ఆ నో బాల్ అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 16వ నో బాల్. దీంతో అతను అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా నో బాల్స్ వేసిన మూడో ప్లేయర్‌గా అవతరించాడు. అ మ్యాచ్‌కి ముందు ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ ఉండేవాడు.

2 / 5
అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా నో బాల్స్ వేసిన ఆటగాడిగా సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నే మోర్కెల్ ఉన్నాడు. మోర్కెల్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 19 నో బాల్స్ వేసి ఈ చెత్త రికార్డ్‌ను మోస్తున్నాడు.

3 / 5
మోర్కెల్ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ రెండో స్థానంలో ఉన్నాడు. బ్రెట్ లీ మొత్తం 17 నో బాల్స్ వేశాడు.

4 / 5
అర్ష్‌దీప్ 17 నో బాల్స్‌తో మూడో స్థానానికి చేరుకోవడంతో.. ఆ స్థానంలో ఇంతక ముందు ఉన్న  మలింగ నాల్గో స్థానానికి పడిపోయాడు. మలింగ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో మొత్తం 14 నో బాల్స్ వేశాడు.

5 / 5
Follow us