పుష్ప 2 కూడా సమ్మర్ రేసులోనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది.. 2023లోనే దీన్ని తీసుకురావాలనుకున్నా.. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు కారణంగా కుదర్లేదు. 2024 సమ్మర్‌లోనే దీన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు సుక్కు. ఇదే సీజన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రానుంది. ఒక్కసారి ఊహించుకోండి.. పవన్, ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్.. అంతా ఒకేసారి వస్తే సీన్ ఎలా ఉంటుందో..?