వాస్తవానికి ప్రపంచ సైంటిస్టులతో పోలిస్తే మన శాస్త్రవేత్తలు చాలా ప్రతిభావంతులని చెప్పుకోవచ్చు. ఇందుకు నిదర్శనమే.. అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న రాకెట్ ప్రయోగాలు. కొన్ని ప్రయోగాలైతే.. సినిమా బడ్జెట్‌ల కన్నా తక్కువ ఖర్చుతోనే పూర్తయిన సందర్భాలున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. గ్రావిటీ సినిమాకు పెట్టిన ఖర్చు రూ. 644 కోట్లు, మంగళయాన్ ప్రయోగానికి రూ.470 కోట్లు. గ్రావిటీ సినిమాకు అయిన ఖర్చు రూ. 644 కోట్లు, మంగళయాన్ రూ. 470, మిషన్ మంగళ్ రూ. 70 కోట్లు. ఇంటర్‌స్టెల్లర్ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.1062 కోట్లు, చంద్రయాన్ 2 రూ.978 కోట్లు. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ రూ. 600 కోట్లు, చంద్రయాన్ 3 రూ. 615కోట్లు.