మోదీపై కూడా అనర్హత వేటు ఎందుకు వేయలేదు..మమతా బెనర్జీ అల్లడు సంచలన ఆరోపణలు
మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ, మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ, మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 2021లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ.. మమతా బెనర్జీని కూడా దీదీ ఓ దీదీ అంటూ ఎగతాలి చేశాడని.. మహిళల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. అలాంటప్పుడు మోదీపై కూడా అనర్హత వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం లేదని.. కానీ లోక్ సభ సభ్యునిగా రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించిన విధానాన్ని ఖండిస్తున్నాని ఉద్ఝాటించారు.
అలాగే బీజేపీ అధికారి సువెందు అధికారి కూడా ఓ గిరిజన మహిళా మంత్రిని అవమానించాడని ఎస్టీ కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతీశారని అభిషేక్ ఆరోపించారు. సువెందు అధికారిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనర్హత వేటు వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విపక్షాలకు ఓ చట్టం బీజేపీ నాయకుల కోసం మరో చట్టం ఉందా అని ప్రశ్నించారు. వీరిపై కూడా న్యాయవాదులు సూరత్ కోర్టు తీర్పును ఆయుధంగా వాడుకొని ప్రధానీ మోదీ, సువెందు అధికారిలపై నెలలోపల పిటీషన్ ధాఖలు చేయాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం