Viral Video: లయ తప్పుతోన్న హృదయం.. డీజే సాంగ్‌కి డాన్స్ చేస్తూ మృతి చెందిన యువకుడు..

తాజాగా మరో గుప్పెడంత గుండె ఆగిపోయింది. పెళ్లి వేడుకలో డీజే సాంగ్ కి డాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందాడు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. 

Viral Video: లయ తప్పుతోన్న హృదయం.. డీజే సాంగ్‌కి డాన్స్ చేస్తూ మృతి చెందిన యువకుడు..
Dance Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 28, 2023 | 10:26 AM

గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. యోగాసనాలు చేస్తూనో, డ్యాన్స్ చేస్తూనో, ఆటలు ఆడుతూనో హఠాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా మరో గుప్పెడంత గుండె ఆగిపోయింది. పెళ్లి వేడుకలో డీజే సాంగ్ కి డాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందాడు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్యసాయి , శ్రీపెరంబదూర్ లోని ఓప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితుడి పెళ్లి వేడుకలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కుప్పకూలి పోయాడు. ఆసుపత్రికి తరలించే లోపునే ఆ యువకుడు  ప్రాణం విడిచాడు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వయసుతో సంబంధం లేకుండా లయ తప్పుతోంది. గుప్పెడంత గుండె గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..