NIA Raids: టెర్రర్ ఫండింగ్ కేసులో విస్తృత సోదాలు.. కశ్మీర్ షోపియాన్‌లో ఎన్‌ఐఏ దాడులు
ఉదయాన్నే నిద్రలేవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అయితే ఇది పూర్తిగా నిజం. అయితే, దాని ప్రయోజనం కూడా అలారం లేకుండా లేచే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.తీవ్రవాదులకు స్లీపర్ సెల్స్‌గా వ్యవహరిస్తున్న వారితో పాటు, దేశంలో ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్న వారిని ఏరివేస్తుంది. అందులో భాగంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించి ఇప్పటికే హురియత్ నాయకుడు ఖాజీ యాసిర్, జమ్మూ కాశ్మీర్ సాల్వేషన్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు జాఫర్ భట్‌ల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఆ సోదాల్లో లభించిన ఆధారాల ప్రకారం NIA తాజా దాడులు చేస్తోంది.ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో దాడులను నిర్వహించిన ఎప్ఐఏ పలువురిని అరెస్ట్ చేసింది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, NIA బృందం షోపియాన్ జిల్లాలోని వాచి ప్రాంతంలో దాడి చేసింది. దీనితో పాటు, పుల్వామా జిల్లాలోని నెహ్మా, లిట్టార్, కుల్గామ్ జిల్లాలోని ఫ్రెసల్ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయి. దాడి ఇంకా ప్రారంభంకాని అనంత్‌నాగ్‌లోని అచావల్ జిల్లాకు కూడా ఎన్‌ఐఏ బృందం చేరుకుంది.
ఆసియా ఆంద్రాబీ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అంతకుముందు ఉదయం, శ్రీనగర్‌లోని మహిళా వేర్పాటువాది ఆసియా ఆంద్రాబీ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ప్రస్తుతం ఆసియా జైలులో ఉంది. అతని ఇంటిని 2019లో NIA అటాచ్ చేసింది.
ఒకరోజు ముందు సోమవారం (మార్చి 13) ISIS కేరళ మాడ్యూల్ కేసులో NIA శ్రీనగర్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. NIA అధికారులు తనిఖీ సమయంలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లోని కర్ఫాలీ మొహల్లాలో ఉజైర్ అజర్ భట్ అనే వ్యక్తి ఇంటిపై దాడి జరిగింది. ఈ కుట్రలో భట్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం