Girl Swallows Mobile: సోదరుడితో గొడవపడి సెల్‌ఫోన్‌ మింగేసిన యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..?

ఇంట్లో అన్నా చెల్లిల్ల మధ్య గొడవలు సాధారణం. కోపంతో ఒకరినొకరు కొట్టుకోవడం లేదంటే చేతిలో ఉన్ వస్తువులు పగలగొట్టడం వంటివి చేస్తుంటారు. ఐతే ఓ యువతి మాత్రం తన సోదరుడితో గొడవపడి కోపంతో తన చేతిలోని మొబైల్ ఫోన్ సెల్‌ ఫోన్‌ మింగేసింది..

Girl Swallows Mobile: సోదరుడితో గొడవపడి సెల్‌ఫోన్‌ మింగేసిన యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..?
Girl Swallows Mobile
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2023 | 7:30 AM

ఇంట్లో అన్నా చెల్లిల్ల మధ్య గొడవలు సాధారణం. కోపంతో ఒకరినొకరు కొట్టుకోవడం లేదంటే చేతిలో ఉన్ వస్తువులు పగలగొట్టడం వంటివి చేస్తుంటారు. ఐతే ఓ యువతి మాత్రం తన సోదరుడితో గొడవపడి కోపంతో తన చేతిలోని మొబైల్ ఫోన్ సెల్‌ ఫోన్‌ మింగేసింది. హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్‌ చేసి ఫోన్‌ బయటికి తీశారు. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాలో గురువారం (ఏప్రిల్ 6) షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. గురువారం నాడు 18 ఏళ్ల యువతి సోదరుడితో గొడవపడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువతి చైనీస్‌ మొబైల్‌ ఫోన్‌ను మింగేసింది. అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్వాలియర్‌లోని జయారోగ్య ఆసుపత్రి (JAH)కి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో సెల్‌ఫోన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం దాదాపు రెండు గంటలపాటు శస్త్రచికిత్స చేసి వైద్యులు సెల్‌ ఫోన్‌ను బయటకు తీశారు. ఆపరేషన్‌ అనంతరం పది కుట్లు వేశామని, ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ కుష్వాహా తెలిపారు. తన కెరీర్‌లో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.