Viral: వామ్మో! ఖతర్నాక్ కి’లేడి’.. ప్రియుడితో పారిపోయేందుకు చేయకూడని పని.. సీన్ కట్ చేస్తే!

ఓ యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఏకంగా ఎంతకు తెగించిందంటే..! ఖతర్నాక్ ప్లాన్‌తో మర్డర్ చేసింది.

Viral: వామ్మో! ఖతర్నాక్ కి'లేడి'.. ప్రియుడితో పారిపోయేందుకు చేయకూడని పని.. సీన్ కట్ చేస్తే!
Image Credit source: Social Media
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 30, 2023 | 1:13 PM

ఓ యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఏకంగా ఎంతకు తెగించిందంటే..! ఖతర్నాక్ ప్లాన్‌తో మర్డర్ చేసింది. ఎవ్వరికీ తెలియదని అనుకుంది. కానీ సీన్ కట్ చేస్తే.. చివరికి బండారం బట్టబయలు అయింది. జైలులో ఊసలు లెక్కపెట్టింది. 2017లో జరిగిన ఈ ఘటనకు తాజాగా నిందితురాలికి శిక్ష విధించింది న్యాయస్థానం.

వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని పానిపట్‌కు చెందిన జ్యోతి, కృష్ణ అనే ఇద్దరు యువతీయువకులు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇందుకు జ్యోతి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిరువురూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో అనుమానం రాకుండా ఉండేందుకు తనలానే ఉన్న మరో అమ్మాయిని హత్య చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ సీరియల్ చూసి.. మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేశారు. అనుకున్న పధకం ప్రకారమే.. సిమ్రాన్ అనే అమ్మాయిని చంపాలని స్కెచ్ వేశారు. ఆమెతో ఫ్రెండ్ షిప్ పెంచుకున్నారు. తమ ప్రణాళికను అమలు చేశారు. ఇందులో భాగంగా 2017, సెప్టెంబర్ 5న ఆమెను స్థానికంగా ఉన్న ఓ షాపుకు రమ్మని.. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. ఇక ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక సిమ్రాన్ బట్టలు మార్చి.. ఘటనా స్థలంలో క్లూస్ లేకుండా చేసి.. జ్యోతికి సంబంధించిన వస్తువులు వదిలేసి వెళ్లిపోయారు.

ఈలోగా జ్యోతి కనిపించడం లేదంటూ వాళ్ల కుటుంబ సభ్యులు పానిపట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్ మృతదేహాన్ని జ్యోతి కుటుంబసభ్యులకు చూపించారు. ఆమె బాడీ దగ్గర ఉన్న వస్తువుల ఆధారంగా మృతదేహం జ్యోతిదే అని గుర్తించి.. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. అటు వైపు సిమ్రాన్ తల్లితండ్రులు కూడా తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. అనుమానం వచ్చి.. సిమ్రాన్ మృతదేహాన్ని వారికి చూపించారు. మెడకు ఉన్న దారం, ముక్కుపుడక ఆధారంగా అది తన కూతురేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో చనిపోయిందని సిమ్రాన్ అని.. జ్యోతి కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి.. జ్యోతి, కృష్ణల కోసం వెతికే పనిలో పడ్డారు. వారిద్దరూ సిమ్లాలో ఉన్నట్లు గుర్తించారు. చివరికి 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలులో ఉండగా కృష్ణ క్షయ వ్యాధితో చనిపోయాడు. ఇక ఈ ఘటనపై 26 మందిని విచారించిన పానిపట్ కోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆమెకు జీవితఖైదు విధించడంతో పాటు రూ. 70 వేల కట్టాలని ఆదేశించింది.(Source)