Love Letter: ‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. 13 ఏళ్ల బాలికకు 47 ఏళ్ల టీచర్ రాసిన ప్రేమ లేఖ..!

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే.. ఈ సమాజం ఎటువైపునకు వెళ్తోందని అనిపించక మానదు. సమాజాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దే గురువులే..

Love Letter: ‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. 13 ఏళ్ల బాలికకు 47 ఏళ్ల టీచర్ రాసిన ప్రేమ లేఖ..!
Minor Girl
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2023 | 11:24 PM

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే.. ఈ సమాజం ఎటువైపునకు వెళ్తోందని అనిపించక మానదు. సమాజాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దే గురువులే.. పెడదారిన పడుతుండటం ఆందోళనకరం అని చెప్పాలి. తాజాగా 47 ఏళ్ల ఉపాధ్యాయుడు 13 ఏళ్ల బాలికకు ప్రేమ లేఖ రాశాడు. సెలవుల్లో నిన్ను చాలా మిస్ అవుతున్నానంటూ, వీలైనప్పుడల్లా ఫోన్ చేయవా అంటూ చిల్లర వేషాలు వేశాడు. అంతేకాదండోయ్.. లేఖ చదివిన తరువాత దానిని చించేయాలని, ఎవరికీ చూపించొద్దంటూ కన్నింగ్ బ్రెయిన్‌ను కూడా చూపించాడు. కానీ, ఆ అమ్మాయి ఊరుకోలే.. ఈ కీచక ఉపాధ్యాయుడి వేధింపులు మరీ శృతిమించుతుండటంతో.. ఆ లేఖను నేరుగా తన తల్లిదండ్రులకు చూపించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని పాఠశాలలో హరిఓమ్ సింగ్ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు. అయితే, అతను 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు. అయితే, యూపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. దాంతో విద్యార్థిని ఇంటివద్దే ఉంటుంది. కానీ, అమ్మాయిపై మనసుపడిన టీచర్.. ఆమెకు ఒక లేఖ రాశాడు. ఈ సెలవుల్లో తనను చాలా మిస్ అవుతున్నానంటూ లేఖలో రాశాడు. అంతేకాదు.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు, చాలా ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నాడు హరిసింగ్. వీలైనప్పుడల్లా తనకు ఫోన్ చేయాలని కూడా కోరాడు. సెలవుల్లో ఒకరోజు వచ్చి తనను కలవాలని, నిజంగా తనను ప్రేమిస్తున్నట్లయితే తప్పకుండా వస్తావంటూ లేఖలో చాటభారతం అంతా రాశాడు. అంతేకాదండోయ్.. చివరగా సెక్యూర్‌గా ఉండేందుకని లేఖ చదివిన తరువాత వెంటనే చింపేయాలని, ఎవరికీ చూపించొద్దని విద్యార్థినిని కోరాడు.

అయితే, బాలిక విషయాన్ని తన పేరెంట్స్‌కి చెప్పడంతో మ్యాటర్ మొత్తం లీక్ అయ్యాడు. మాస్టర్ కతలకు ఎండ్ కార్డ్ పడింది. బాలిక, ఆమె పేరెంట్స్, బంధువులంతా కలిసి సదరు ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లారు. ఇదేంటని నిలదీశారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే, ఆ కీచక ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడు. తీవ్ర పరిణామాలు ఉంటాయని, అమ్మాయిని లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. కీచక టీచర్ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఆరోపణలు నిజమైతే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఉన్నతాధికారులు సైతం స్పందించారు. ఘటనపై విచారణ జరిపి.. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..