ఢిల్లీలో ప్రత్యక్షమైన అమృత్‌పాల్.. మిత్రుడితో కలిసి చక్కర్లు.. బయటపడ్డ కొత్త వీడియో
Amritpal Singh: పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖలిస్తాన్ అనుకూల నేత అమృత్‌పాల్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్షంకావడం సంచలనం రేపింది.
పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖలిస్తాన్ అనుకూల నేత అమృత్‌పాల్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్షంకావడం సంచలనం రేపింది. అమృత్‌పాల్‌తో పాటు అతడి అనుచరుడు పపల్‌ప్రీత్‌సింగ్ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈనెల 21న అమృత్‌పాల్ ఢిల్లీలో ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ఈ వీడియో ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతానికి సంబంధించినది. అమృతపాల్ సింగ్ తలపాగా లేకుండా ఈ వీడియోలో కనిపించాడు. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు అమృత్‌పాల్‌సింగ్ నేపాల్‌కు పారిపోయినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అక్కడి నుంచి దొంగ పాస్‌పోర్ట్‌తో కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తునట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్‌లో అమృత్‌పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందం చేరుకుంది. గత 16వ తేదీ నుంచి పోలీసులకు చిక్కడం లేదు అమృత్‌పాల్‌సింగ్. ఆయన కోసం పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మరోవైపు అమృతపాల్ తరపు న్యాయవాది షాకోట్ పోలీస్ స్టేషన్‌లో అతను అక్రమ కస్టడీలో ఉన్నాడని వాదించారు.
Another cctv footage of #Amritpal and pupplpreet . According to source it’s dated March 21 and taken in Delhi pic.twitter.com/C3O8EJHGnR
— Varun SR Goyal (@varunmaddy) March 28, 2023
అమృత్‌పాల్ కుట్రకు సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తాన్ పేరిట ఏకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని మళ్లీ వేగవంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడు అమృత్‌పాల్. పాక్ ఐఎస్‌ఐ సహకారంతో పన్నాగాలు పన్నుతున్నాడు. అందుకోసం ఇప్పటికే అతడు అధికారిక కరెన్సీ, జెండాను, పాస్‌పోర్టును సిద్ధం చేసినట్లు కనుగొన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి అమృత్‌పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమృత్‌పాల్ నెట్‌వర్క్‌పై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 250 మంది ఖలిస్తాన్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ.. క్లిక్ చేయండి…