Indian railways: రైల్వే వ్యాగన్లకు జీపీఎస్.. ఇక దొంగతనాలకు చెక్.. ఎక్కడున్నాఇట్టే పట్టేస్తారు! వివరాల కోసం క్లిక్ చేయండి..

వాస్తవానికి రైల్వేకు సరుకు రవాణా ద్వారా కూడా అధిక ఆదాయం లభిస్తోంది. అయితే ఓపెన్ వ్యాగన్ ల కారణంగా కొంత నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిని అధిగమించేందుకు రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేసింది.

Indian railways: రైల్వే వ్యాగన్లకు జీపీఎస్.. ఇక దొంగతనాలకు చెక్.. ఎక్కడున్నాఇట్టే పట్టేస్తారు! వివరాల కోసం క్లిక్ చేయండి..
Wagon 1
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 23, 2022 | 2:32 PM

భారతీయ రైల్వే సాంకేతిక బాట పట్టింది. పలు సంస్కరణలతో సర్వతోముఖాభివ‌ృద్ధి దిశగా పయనిస్తోంది. అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు.. అందుకనుగుణంగా ఆధునిక సాంకేతికతతో రూపు దిద్దుకుంటున్న ట్రాక్ లు మనం చూస్తున్నాం. ప్రయాణికుల సులభతర, సుఖమయ ప్రయాణానికి అవసరమైన అన్నీ పనులను రైల్వే శాఖ చేపడుతోంది. ఇప్పుడు గూడ్స్ రైళ్లను ఆధునికీకరించేందుకు నడుం బిగించింది. వాస్తవానికి రైల్వేకు సరుకు రవాణా ద్వారా కూడా అధిక ఆదాయం లభిస్తోంది. అయితే ఓపెన్ వ్యాగన్ ల కారణంగా కొంత నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిని అధిగమించేందుకు రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి గూడ్స్ వ్యాగన్ కు జీవీఎస్(GPS) ట్రాకింగ్ డివైజ్ అమర్చాలని నిర్ణయించింది.

వ్యాగన్ జీపీఎస్ ప్రాజెక్టు..

రైలు వ్యాగన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ పోజిషన్ లో ఉంది? దాని కచ్చితమైన లోకేషన్ ను తెలుసుకునేలా వ్యాగన్ జీపీఎస్(WGPS) పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దాదాపు 3,00,000 వ్యాగన్ లకు దీనిని అమర్చేందుకు అవసరమైన సాంకేతిక సహాయం కోసం సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. దీనికోసం అవసరమైన నావిగేషన్ శాటిలైట్ రిసీవర్ కోసం అన్వేషిస్తోంది. కచ్చితమైన సమాచారంతో పాటు రిస్క్ ఫ్రీ గా ఉండే సరియైన డివైజ్ కోసం వెతుకుతోంది. అందులో భాగంగానే ఈ ప్రకటన చేసింది.

గ్లోబల్ రిసీవర్ అవసరం అవుతుందా..

ప్రస్తుతం మన దేశంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం(IRNSS) ఉంది. దీనినే రైల్వే శాఖ వినియోగించాలని భావిస్తోంది. అయితే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా గ్లోబల్ నావిగేషనన్ శాటిలైట్ సిస్టం(GNSS) కోసం కూడా ప్రయత్నించే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

జీపీఎస్ ఎందుకోసం..

సరుకు రవాణాలో మరింత పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్న రైల్వే వ్యాగన్లకు జీపీఎస్ అమర్చుతోంది. వీటి ద్వారా మిస్ అయిన వ్యాగన్లు, లేదా ఓపెన్ వ్యాగన్లలో దొంగతనానికి గురైయ్యే సరుకులను నివారించేందుకు వినియోగించనుంది. వాస్తవానికి వ్యాగన్ల మిస్సింగ్ అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. అయితే దానిలో ఉండే గూడ్స్ అంటే సరుకులు చాలా సందర్భాల్లో చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా ట్రాక్ మధ్యలో రైలు నిలిపివేసినప్పుడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు జీపీఎస్ సాయపడగలదని రైల్వే సంస్థ భావిస్తోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి..