Goa Resort: విదేశీ టూరిస్ట్‌పై లైంగిక వేధింపులు, ఆపై కత్తితో దాడి.. మధ్యలో వచ్చిన వ్యక్తికీ గాయాలు..

డెహ్రాడూన్‌కి చెందిన అభిషేక్ వర్మ ఉత్తర గోవా పెర్నెమ్‌లోని ఓ హోటల్‌లో స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల గోవా పర్యటనకు వచ్చిన నెదర్లాండ్ మహిళపై లైంగిక దాడికి

Goa Resort: విదేశీ టూరిస్ట్‌పై లైంగిక వేధింపులు, ఆపై కత్తితో దాడి.. మధ్యలో వచ్చిన వ్యక్తికీ గాయాలు..
Goa Resort Case
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 31, 2023 | 2:20 PM

G20 Sherpa Meet: దేశవిదేశాలలోని పర్యటకులను ఆకర్షించే భారత్‌లోని పర్యాటక ప్రదేశాలలో గోవా మొదటి స్థానంలో ఉంటుంది. అయితే గోవా పర్యటనకు వచ్చిన ఓ విదేశీ టూరిస్ట్‌పై స్థానిక హోటల్‌లో లైంగిక దాడి జరిగింది. అంతటితో ఆగక ఆమెపై కత్తితో కూడా దాడికి కూడా పాల్పడ్డారు నిందితుడు. అవును, డెహ్రాడూన్‌కి చెందిన అభిషేక్ వర్మ(27) ఉత్తర గోవా పెర్నెమ్‌లోని ఓ హోటల్‌లో స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల గోవా పర్యటనకు వచ్చిన నెదర్లాండ్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమెపై కత్తితో దాడికి దిగాడు. అంతేకాక ఆ విదేశి మహిళకు సహాయంగా వచ్చిన మరోవ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు అభిషేక్. ఇక దీనిపై సదరు బాధితురాలు స్థానిక పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చింది.

పెర్నెమ్ ఎస్‌పీ నిధిన్ వల్సన్‌కు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్రేమ్‌లోని విగ్వామ్ రిసార్ట్‌లో గురువారం మధ్య రాత్రి తన టెంట్‌లోకి గుర్తు తెలియని నిందితుడు చొరబడ్డాడు. దీంతో ఆమె కేకలు వేయడం ప్రారంభించింది. ఆపై తనను వారించేందుకు సదరు నిందితుడు ప్రయత్నించి, బెదిరించాడని ఆమె తెలిపింది. కొద్ది సమయం తర్వాత కత్తితో తిరిగి వచ్చి దాడికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు సహాయంగా వచ్చిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయని ఆమె చెప్పింది. ఆపై పోలీసులు నిందితుడిని అభిషేక్ వర్మగా, సదరు బాధితురాలికి సహాయంగా గాయపడిన వ్యక్తిని యూరికోగా గుర్తించారు. అంతేకాక నిందితుడి నుంచి కత్తిని స్వాదీనం చేసుకోవడంతో పాటు, IPC సెక్షన్ 452,354,307,506(II) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..