పట్టపగలు నడిరోడ్డులో మహిళపై యాసిడ్‌ దాడి! బాధితురాలికి తీవ్రగాయాలు..

అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో ఓ వ్యాపారి మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రగాయాలపాలైంది. సోనిత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సుశాంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం..

పట్టపగలు నడిరోడ్డులో మహిళపై యాసిడ్‌ దాడి! బాధితురాలికి తీవ్రగాయాలు..
Acid Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2022 | 4:49 PM

అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో ఓ వ్యాపారి మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రగాయాలపాలైంది. సోనిత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సుశాంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం..

రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లాకు చెందిన ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 30 ఏళ్ల వయస్సు మహిళను నిందితుడు అడ్డగించాడు. వీరి మధ్య డబ్బు విషయమై గత కొంత కాలంగా విభేదాలు తలెత్తుతున్నాయి. నిజానికి వీరిద్దరు సుపరిచితులే. అంతేకాకుండా వివాహితుడైన నిందితుడు అవివాహితైన సదరు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తలెత్తిన వివాదంలో నిందితుడు మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ దాడిలో మహిళకు 15 శాతం గాయాలయ్యాయి. ఆమె మెడ, తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి. నిందితుడు వత్సుకర్ అనే వ్యాపారిగా గుర్తించాం. అతన్ని సోమవారం అరెస్టు చేసి ధర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ సుశాంత బిస్వా శర్మ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.