Chhattisgarh: భీకర ఘటన.. యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. కారణం ఏంటో తెలుసా?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు. ఈ భయానక ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అయితే, యువతి తనతో మాట్లాడటకపోవడం వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడట. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా జిల్లాలో తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు.
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) పంప్ హౌస్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది యువతి. అయితే, యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ఈ కీచకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. అతను దిండు తీసుకుని ఆమె తలపై అదిమిపెట్టాడు. ఆ తరువాత స్క్రూ డ్రైవర్‌తో 51సార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చి చూడగా.. యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.
అయితే, జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు మూడేళ్ల క్రితం ఓ ప్యాసింజర్ బస్సులో కండక్టర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో బాధిత యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మాట మాట కలిసింది. నిందిత వ్యక్తి కొద్ది రోజుల తరువాత ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. అయితే, విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆమె.. నిందిత వ్యక్తితో మాట్లాడటం మానేసింది. ఆగ్రహానికి గురైన అతను.. మొదట యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత నేరుగా ఇంటికే వచ్చి యువతి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..