ఆరు రోజుల్లో ఐదుసార్లు గుండెపోటు.. మరణ గండాలను జయించిన 81 ఏళ్ల బామ్మ
వయసైపోయిన ముసలివాళ్లకు అనేక రోగాలు వచ్చి చనిపోవడం సహజమే. ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా షూగర్, బీపీ, గుండె సమస్యలు రావడంతో చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
వయసైపోయిన ముసలివాళ్లకు అనేక రోగాలు వచ్చి చనిపోవడం సహజమే. ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా షూగర్, బీపీ, గుండె సమస్యలు రావడంతో చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య గండెపోటుతో చనిపోయేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువకుడు కూడా ఈ సమస్యతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే 81 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు గుండె పోటు వచ్చినప్పటికీ బతికి బయటపడింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు. దాదపు ఐదు సార్లు గుండెపోటు వచ్చినప్పటికీ ఆమె బతకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఢిల్లీలో ఉంటున్న 81 ఏళ్ల వృద్ధురాలు తీవ్రమైన గుండె సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే ఆమెను మాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆమెకు సరిగ్గా ఊపిరి కూడా ఆడలేదు. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆమెను ఆరు రోజులు ఆసుపత్రిలో ఉంచారు. ఈ ఆరురోజుల్లో ఆమెకు ఏకంగా ఐదుసార్లు గుండెపోటు వచ్చింది. ఇలా వచ్చిన ప్రతిసారి ఆమెకు వైద్యులు ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆటోమేటిక్ ఇమ్ ప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫైబ్రలేటర్ (AICD) పరికరాన్ని ఆమె ఛాతి భాగంలో అమర్చి చికిత్స చేశారు. ఆ తర్వాత ఆమె సురక్షితంగా బయటపడింది. ఆ వయసులో కూడా ఆమెకు ఐదుసార్లు గుండె పోటు వచ్చి బతకడంపై వైద్యులు ఆశ్చర్యపోయారు. మాక్స్ ఆసుపత్రిలోని కార్డియాలజీ ఛైర్మన్ అయిన డాక్టర్ బాల్బీర్ సింగ్ ఇదో మిరాకిల్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలిని హాస్పిటల్ నుంటి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆ వృద్ధురాలి కుటుబ సభ్యులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..