గంజాయి స్మగ్లింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు..ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష

2018లో రాయ్ పూర్ చత్తీస్ గఢ్ లోని అదిపెద్ద అక్రమ గంజాయి సరఫరా చేసిన నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిపై ఇప్పుడు ఎన్డీపీఎస్ కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది

గంజాయి స్మగ్లింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు..ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
Drugs
Follow us
Aravind B

|

Updated on: Mar 17, 2023 | 11:27 AM

2018లో రాయ్ పూర్ చత్తీస్ గఢ్ లోని అదిపెద్ద అక్రమ గంజాయి సరఫరా చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిపై ఇప్పుడు ఎన్డీపీఎస్ కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. పట్టుబడ్డ ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు , రెండు లక్షల జరిమానాను విధించింది. 2018 జూన్ 24 వ తేదిన సమాచారం మేరకు రాయ్ పూర్ లోని సంతోష్ నగర్ చౌక్ వద్ద గంజాయితో వెళ్తున్న ఓ ట్కక్ ని డీఆర్ఐ అధికారులు ఆపారు. అందులో చూస్తే ఆ ట్రక్కు మొత్తం కొబ్బరి బోండాలతో నిండి ఉంది. అయితే లోపల తనిఖీలు చేయాగా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ఉండటాన్ని గుర్తించారు.

దాదాపు 6,545 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ. 9,81,75000 కోట్ల రూపాయలని తెలిపారు. అయితే ఆ ట్రక్ లో ఉన్న ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. వారిని విచారించగా గంజాయిని సరఫరా చేస్తున్న మరో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేశారు. 2018లోనే వీరిపై ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 2019 జూన్ లో ఈ నిందితులపై విచారణ ప్రారంభం కాగా ఈ ఏడాది మార్చి 15న ఎన్డీపీఎస్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ విషయంలో కోర్టు తీర్పుపై నెటీజన్లు స్వాగతిస్తున్నారు. యువత జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల సరఫరాదారుల నిందులపై కఠిన చర్యలు తీసుకోవడంపై హార్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..