IRCTC Package: న్యూ ఇయర్ లో కేరళ అందాలను చూడాలనుకుంటున్నారా.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఎంపిక.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

IRCTC అందిస్తున్న ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్లు ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఎయిర్ ప్యాకేజీ అని పేరు పెట్టారు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం రాంచీ నుంచి ప్రారంభమవుతుంది.

IRCTC Package: న్యూ ఇయర్ లో కేరళ అందాలను చూడాలనుకుంటున్నారా.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఎంపిక.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Tour
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2022 | 2:30 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆహ్లాదంగా గడపాలనుకుంటున్నారా..అయితే   IRCTC మీకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తొంది. దక్షిణ భారత దేశంలోని ప్రకృతి అందాలతో అలరించే కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పీలను ఈ ప్యాకేజీ ద్వారా సందర్శించవచ్చు. అద్భుతమైన ఈ టూర్ ప్యాకేజీ 2023 జనవరి నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణం విమానంలో ఉంటుంది. ఐఆర్సీటీసీకి సంబంధించిన ఇతర టూర్ ప్యాకేజీల మాదిరిగానే.. ఈ టూర్ ప్యాకేజీలో కూడా ప్రయాణీకులకు వసతి, ఆహార ఏర్పాట్లను  అందిస్తుంది. న్యూ ఇయర్ (Happy Year 2023) ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి..కేరళను సందర్శించడానికి ఈ టూర్ ప్యాకేజీ ఉత్తమమైనది. ఈ ప్యాకేజీ  గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్లు IRCTC అందిస్తున్న ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్లు ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఎయిర్ ప్యాకేజీ అని పేరు పెట్టారు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం రాంచీ నుంచి ప్రారంభమవుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులను కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పీ , త్రివేండ్రంలకు  తీసుకువెళతారు. ఈ టూర్ ప్యాకేజీ 16వ తేదీ జనవరి 2023 నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది.

టికెట్ వివరాలు 

ఇవి కూడా చదవండి

సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,450

డబుల్ షేరింగ్‌కు రూ.43,150

ట్రిపుల్ షేరింగ్‌కు రూ.40,400లు చెల్లించాల్సి ఉంటుంది.

5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ తీసుకున్నందుకు రూ.34,950లు చెల్లించాలి.

2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ.31,950 చెల్లించాల్సి ఉంటుంది.

టూర్ ప్యాకేజీలో మొత్తం వ్యక్తుల సంఖ్య 21 ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు అలెప్పీ అందాలను దగ్గరగా చూడవచ్చు.  కొచ్చి , మున్నార్‌లను సందర్శించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా మున్నార్ చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులలో ఎల్లపుడూ సందడిగా ఉంటుంది. ఈ న్యూ ఇయర్ రోజున కేరళను సందర్శించాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఇది అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాల కోసం .. టికెట్ ను బుక్ చేసుకోవడానికి..  మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..