Mirchi Vada: మిర్చి బజ్జీ అంటే అంతే మరి ఎవరికైనా నోరు ఊరాల్సిందే.. బ్రిటన్‌ మిర్చి బజ్జి నెట్టింట వైరల్‌

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జాక్‌ డ్రేస్‌ మిర్చిలను మధ్యలోకి కట్‌ చేసి, వాటిలో ఉడకబెట్టిన బంగాళాదుంపను పేస్ట్‌ చేసి, దానిలో కారం, కొద్దిగా మసాలా కలిపి మిర్చిలో స్టఫ్‌గా పెట్టాడు.

Mirchi Vada: మిర్చి బజ్జీ అంటే అంతే మరి ఎవరికైనా నోరు ఊరాల్సిందే.. బ్రిటన్‌ మిర్చి బజ్జి నెట్టింట వైరల్‌
Uk Man Mirchi Vada
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2022 | 6:03 PM

భారతీయ వంటలకు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఉన్నారు.. ఇండియన్ వంటకాలను రుచి చూడడమే కాదు.. ఇప్పుడు కొందరు భారతీయ ఆహారపదార్ధాలను తయారు చేయడానికి కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు  బ్రిటన్‌కు చెందిన జాక్‌ డ్రేన్‌. ఇతనికి భారతీయ వంటకాలంటే ఎంతో ఇష్టం. అతని ఇన్‌స్టాలో చూస్తే అన్నీ ఇండియన్‌ డిషెస్సే కనిపిస్తాయి. తాజాగా అతను మిర్చి బజ్జీ తయారు చేశాడు. అతను చేసిన మిర్చి బజ్జీ చూసి నెటిజన్ల నోట్లో నీళ్ళూరాయంటే నమ్మండి. జాక్‌ డ్రేన్‌ తయారు చేసిన మిర్చి బజ్జీ వంటకం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జాక్‌ డ్రేస్‌ మిర్చిలను మధ్యలోకి కట్‌ చేసి, వాటిలో ఉడకబెట్టిన బంగాళాదుంపను పేస్ట్‌ చేసి, దానిలో కారం, కొద్దిగా మసాలా కలిపి మిర్చిలో స్టఫ్‌గా పెట్టాడు. దానిని శనగపిండిలో ముంచి ప్యాన్‌లో డీప్‌ ఫ్రై చేశాడు. తర్వాత వాటిని గోల్డెన్ క‌ల‌ర్‌ వచ్చేలా దోర‌గా వేయించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘మిర‌ప‌కాయ‌ల్లో ఆలూ మ‌సాలా స్టఫ్ చేసి శ‌న‌గ‌పిండిలో ముంచి!!!’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by JAKE DRYAN (@plantfuture)

ఈవీడియో దేశీయ భోజన ప్రియులకు తెగ నచ్చేసింది. 90 లక్షలమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు, లొట్టలేస్తూ జాక్ కుకింగ్ స్కిల్స్‌పై ప్రశంస‌లు గుప్పించారు. ఈ వంట‌కాల‌ను మీరు చేస్తున్న తీరు బాగుంది..ఎలాంటి స్పూన్‌లు ఉప‌యోగించ‌కుండా చేతుల‌ను వాడారు. భార‌త ఆహారం త‌యారు చేసే విధానం అదే..అయితే ముందుగా మీరు చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం చాలా ఇంపార్టెంట్‌ సుమా అంటూ ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..