Health Tips: ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా? ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందట..!
మీరు కూడా మీ పర్స్‌ను, పౌచ్‌ను ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకుంటున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు నిపుణులు. ఈ అభిరుచే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ కారణంగా.. ప్రజలు ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌కు గురవుతున్నారని అనేక అధ్యయనాలు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువ మంది యువతే ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. కంటిన్యూగా వస్తున్న ఇలాంటి కేసులను చూసి..
సాధారణంగా చాలా మంది ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటారు. వెనుక పర్స్ పెట్టుకోవడం వలన అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా మీ పర్స్‌ను, పౌచ్‌ను ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకుంటున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు నిపుణులు. ఈ అభిరుచే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ కారణంగా.. ప్రజలు ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌కు గురవుతున్నారని అనేక అధ్యయనాలు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువ మంది యువతే ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. కంటిన్యూగా వస్తున్న ఇలాంటి కేసులను చూసి వైద్యులు షాక్ అవుతున్నారు. ప్రజలు ఇలాంటి అలవాటును మార్చుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ప్యాంటు వెనుక జేబులో పర్సు పెట్టుకునే అలవాటు మీ తుంటిపై చెడ ప్రభావం చూపుతుంది. చాలా మంది ముఖ్యమైన పత్రాల నుంచి డబ్బు, ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల వరకు అన్నీ తమ వాలెట్లలో పెట్టుకుంటారు. ఈ సందర్భంలో, పర్స్ చాలా మందంగా మారుతుంది. ప్రజలు తమ పర్సును ప్యాంటు జేబులో పెట్టుకుని కూర్చున్నప్పుడు, దాని ఒత్తిడి పిరుదులపై ఉంటుంది. ఫలితంగా పిరుదులపై చెడు ప్రభావం పడుతుంది.
ఇది తుంటి సమతుల్యతను పాడు చేస్తుంది. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ క్రమంగా సయాటికా వంటి తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది. అంతే కాకుండా తుంటికి తిమ్మిరి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థోపెడిక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత కాలంలో ఈ తరహా సమస్యతో వస్తున్న వారి సంఖ్య వేగంగా పెరిగుతోందన్నారు.
ఇందులోనూ పని చేసే యువత సంఖ్యే ఎక్కువగా ఉందట. సాధారణంగా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పని చేసే వారు ఎక్కువగా ఉంటారు. వీరు తమ వాలెట్‌ను ప్యాంటు వెనుక జేబులో ఉంచడం వలన ఇలాంటి సమస్య ఎదురవుతుంది. విద్యార్థులు, బ్యాంకర్లు, డ్రైవర్లు, డెస్క్ వర్కర్లలో ఈ రకమైన సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధిని నివారించాలనుకుంటే, మీరు మీ వాలెట్‌ను మీ వెనుక జేబులో ఉంచుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్యాంట్ వెనుక జేబులో వాలెట్ పెట్టుకోవాల్సి వస్తే.. చాలా సన్నగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మొబైల్‌లో కూడా డిజిటల్ ఫార్మాట్‌కు అవకాశం ఉన్నందున.. దాదాపుగా వాలెట్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..