Hair Care Tips: ఈ 5 పదార్థాలు మీ జుట్టు రాలే సమస్యను పెంచుతాయి.. అవేంటంటే..

నల్లని ఒత్తైన వెంట్రుకలు కావాలని అందరూ కోరుకుంటారు. జుట్టు సహజ సౌందర్య సాధనంగా కనిపిస్తుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అందరూ నల్లని ఒత్తైన జుట్టును కోరుకుంటారు.

Hair Care Tips: ఈ 5 పదార్థాలు మీ జుట్టు రాలే సమస్యను పెంచుతాయి.. అవేంటంటే..
Hair Care Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2023 | 8:25 AM

నల్లని ఒత్తైన వెంట్రుకలు కావాలని అందరూ కోరుకుంటారు. జుట్టు సహజ సౌందర్య సాధనంగా కనిపిస్తుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అందరూ నల్లని ఒత్తైన జుట్టును కోరుకుంటారు. అయితే, ప్రస్తుత చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా జుట్టు రాలే సమస్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న వయస్సులోనే జుట్టు రాలే సమ్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, జుట్టు రాలిపోయే సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది పురుషులు వయస్సు రాకముందే బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడే స్త్రీల నుండి పురుషుల వరకు.. అనేక ఇంటి నివారణలు, నూనెలు, షాంపూలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చుండ్రు, సన్నని జుట్టు, బట్టతల వస్తుంది. అయితే, ఈ సమస్యకు పై కారణాలతో కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణం అని చెబుతున్నారు నిపుణులు. ఆ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. మరి జుట్టు రాలే సమస్యను తీవ్రం చేసే ఆ పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

షుగర్..

చక్కెర అధిక వినియోగం అనేక వ్యాధులను ప్రేరేపిస్తుంది. చక్కెర శరీరానికి హానికరం. ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిక్ రోగులలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీని కారణంగా వారి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అధిక బరువు కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. సరైన సమయంలో అదుపు చేసుకోకపోతే బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే షుగర్‌ని చాలా తక్కువగా తీసుకోవాలి.

మద్యం..

మద్యం సేవించడం ఏ విధంగానూ మంచిది కాదు. మద్యం సేవించడం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక నష్టాలు కలుగుతాయి. ఆల్కహాల్ మీ జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. నిజానికి, జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల ప్రోటీన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జుట్టు బలహీనంగా మారుతుంది. తద్వారా రాలడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి గుడ్డు..

గుడ్డు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా జుట్టుకు గుడ్డు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అయితే దానిని ఉపయోగించడానికి సరైన మార్గం ఉంది. పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. పచ్చి గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. బయోటిన్ కెరాటిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది హెయిర్ ప్రొటీన్‌గా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు పచ్చి గుడ్డు తినకుండా ఉడికించిన గుడ్డు తినాలి.

జంక్ ఫుడ్..

ప్రస్తుత రోజుల్లో పిల్లల నుండి యువత వరకు జంక్ ఫుడ్ వినియోగం పెరిగింది. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం. సంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు జంక్ ఫుడ్‌లో కనిపిస్తాయి. దీని వల్ల ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతాయి. జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. స్పైసీ, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కాల్ప్ లూబ్రికేట్ అవుతుంది. దీని వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది.

చేపలు..

చేపల వినియోగం కూడా జుట్టు రాలే సమస్యను పెంచుతుంది. చేపలలో పాదరసం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అందుకే హెయిర్ ఫాల్ గురించి ఆందోళన చెందుతుంటే చేపలు తీసుకోవడం తగ్గించండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్య నివేదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..