Benefits of Cloves: లవంగాలే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? అయితే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తప్పక తెలుసుకోండి..

మన వంటగదిలో కనిపించే సుగంధద్రవ్యాలలో లవంగం కూడా ప్రధానమైనవాటిలో ఒకటి. లవంగాలలో అనేక రకాల పోషకాలు ఉన్నందునే మన పూర్వీకులు దీనిని మన వంటలలో ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కేవలం వంటలలోకే కాక..

Benefits of Cloves: లవంగాలే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? అయితే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తప్పక తెలుసుకోండి..
Benefits Of Cloves
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 24, 2022 | 1:01 PM

సుగంధద్రవ్యాల గురించి మీరు వినే వింటారు. ఇవి మన వంటగదిలో అనునిత్యం కనిపిస్తూనే ఉంటాయి. వంటకం ఏదైనా దానిని రుచికరమైనదిగా మార్చడంలో ఇవి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సుగంధద్రవ్యాలకు మన వంట గదులలోనే కాక ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. మన వంటగదిలో కనిపించే సుగంధద్రవ్యాలలో లవంగం కూడా ప్రధానమైనవాటిలో ఒకటి. లవంగాలలో అనేక రకాల పోషకాలు ఉన్నందునే మన పూర్వీకులు దీనిని మన వంటలలో ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కేవలం వంటలలోకే కాక విడిగా కూడా లవంగం ఎన్నో రకాలుగా మానవ ఆరోగ్యాన్ని కాపాడగలిగే ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగాలలో ఉన్న పోషకాలు

చాలామంది లవంగాలను సుగంధద్రవ్యాలుగా లేదా కేవలం మసాలాదినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు అనేకం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీర వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో కూడా లవంగం ఉపకరిస్తుంది.

లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

లవంగాలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా లవంగాలను కాస్మటిక్స్ తయారీలో , ఫార్మాస్యూటికల్స్‌లలో, వ్యవసాయ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలా మాత్రమే కాకుండా రోజూ మూడు పూటలా భోజనం తరువాత లవంగాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తరువాత లవంగాన్ని తింటే జీర్ణ వ్యవస్థ పనితనం మెరుగుపడుతుందని, తద్వారా పేగులు శుభ్రపడతాయని వారు చెబుతున్నారు. కడుపులో సూక్ష్మజీవుల నుంచి మాత్రమేకాక, శరీరారోగ్యానికి హాని కలిగించే వివిధ రకాల క్రిములు, ఇన్ఫెక్షన్ల నుంచి లవంగం కాపాడుతుందని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం నివారణకు లవంగాలు

లవంగాలతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాక అనేగ ఆరోగ్య రుగ్మతల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలను నిత్యం తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు నివారణ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తొలిదశలో ఉంటే దానిని లవంగాలు నిరోధిస్తాయని అంటున్నారు. డయాబెటిస్‌‌ను అదుపులో ఉంచడంలో కూడా లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. ఇక లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి నొప్పులు, వాపులను సమసిసోతాయంటున్నారు. దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే తగ్గుతుందని వారు చెబుతున్నారు.

కానీ..అతిగా మాత్రం తీసుకోవద్దు

లవంగాలు కడుపులో వికారం వంటి ఇబ్బందులను తొలగిస్తాయని, లివర్, చర్మ సమస్యలు తగ్గిస్తాయి. లవంగాలు కడుపులో అల్సర్స్‌ను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి. ఇక లవంగాలు మంచి చేస్తాయని చాలా మంది ఎప్పుడూ కూడా తమ నోట్లో లవంగాలను ఉంచుకుంటారు. అయితే ఎప్పటికీ అలా నోట్లో లవంగాలు ఉంచుకోవటం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. లవంగాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, అదేపనిగా లవంగాలను తింటే, కొత్తరకం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి రోజుకు ఒకటి రెండు లవంగాలను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని, మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..