Maruti Suzuki price hike: ఏప్రిల్ నుంచి మోతెక్కనున్న కార్ల ధరలు! కారు కొనాలనుకొంటే ఇప్పుడే కొనేయండి..
కొత్త ఆర్థిక సంవత్సరంలో కారు కొనుగోలు చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోవాల్సిందే? ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీల కార్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది.
మీరు కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మార్చి ముగిశాక, ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో కారు కొనుగోలు చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోవాల్సిందే? ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నియమ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీల కార్ల రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. మారుతీ సుజుకీ ఇప్పటికే దీనిపై ఓ ప్రకటన చేసింది. తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు వివరించింది. కాబట్టి కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీరు ఈ నెలాఖరులోపే కొనుగోలు చేయడం ఉత్తమం.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు..
మురుతి సుజుకి ఏప్రిల్ ఒకటో తేదీని తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు గురువారం ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నియంత్రణ బాధ్యతల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత మేరకు ధర పెరుగుతుందన్న విషయాన్ని కంపెనీ స్పష్టంగా చెప్పలేదు. అయితే అంతకంతకూ పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుకోనేందుకు ధరల పెంపు అనివార్యమవుతోందని మాత్రం చెప్పింది. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే ఆర్డీఈ నిబంధన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.కార్ల తయారీలో కీలకంగా ఉన్న మెటీరియల్ ధర పెరుగుల కారణంగా మారుతి సుజుకి 2021 జనవరిలో ధరల పెంపును చేపట్టిందన్నారు. ఇప్పుడు తప్పనిసరిర పరిస్థితుల్లో మళ్లీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఆధునికీకరించిన మోడళ్లను ఈ నిబంధనలకు అనుగుణంగానే తీసుకొస్తున్నట్లు వివరించారు.
బుకింగ్స్ ప్రారంభం..
ఇదిలా ఉండగా, మారుతి సుజుకి తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జా సీఎన్జీ వేరియంట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆసక్తి గల కస్టమర్‌లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు . నివేదికల ప్రకారం, డెలివరీలు మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో బ్రెజ్జా సిఎన్‌జిని మారుతి సుజుకి తొలిసారిగా ఆవిష్కరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..