Kamasutra: కామసూత్రను వంటబట్టించుకున్న మోడల్.. శృంగారం లేకుండా అది పొందొచ్చట..

శృంగారంలో భావప్రాప్తి అనేది చాలా కీలకం. భావప్రాప్తి పొందడం ద్వారా శృంగారంలో స్త్రీ సంతృప్తి చెందుతారు. అయితే, శృంగారం చేయకుండానే, కేవలం మనసు ద్వారా భావప్రాప్తి పొందొచ్చా? అంటే అవుననే అంటోంది ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, మోడల్ యేలా వోంక్.

Kamasutra: కామసూత్రను వంటబట్టించుకున్న మోడల్.. శృంగారం లేకుండా అది పొందొచ్చట..
Woman
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 06, 2023 | 1:24 PM

శృంగారంలో భావప్రాప్తి అనేది చాలా కీలకం. భావప్రాప్తి పొందడం ద్వారా శృంగారంలో స్త్రీ సంతృప్తి చెందుతారు. అయితే, శృంగారం చేయకుండానే, కేవలం మనసు ద్వారా భావప్రాప్తి పొందొచ్చా? అంటే అవుననే అంటోంది ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, మోడల్ యేలా వోంక్. అవును, తాను మనస్సు ద్వారా భావప్రాప్తి పొందగలనని చెబుతోంది యేలా. ఇది తాను ఆస్వాదించిన అత్యుత్తమ సెక్స్ అనుభూతి అని పేర్కొంది. అంతేకాదు.. దీనంతటికీ కారణం కామసూత్ర అని చెబుతోంది. ఇందుకు సంబంధించి ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఆమె తన మనస్సుతో ఎలా భావప్రాప్తి చెందుతుంది? కామసూత్రతో ఆమె ఏం చేసింది? ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వోంక్ లైంగిక అంశాలు, శృంగారం, జీవితంలో భావోద్వేగ నియంత్రణపై పురాతన భారతీయ సంస్కృత గ్రంథమైన కామ సూత్రను అధ్యయనం చేసింది. కోస్టారికాలో ఒక రిట్రీట్‌ను సందర్శించిన ఆమె.. అక్కడ కామసూత్రను అధ్యయనం చేసింది. తన మనస్సు శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంది. ఇదే విషయాన్ని ఇతర మహిళలకూ తెలపాలని భావిస్తున్నట్లు చెప్పింది వోంక్. మహిళలకు వారి లైంగిక జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? కోరుకున్న దాన్ని, మనసులోని కోరికలను ఎలా వెలిబుచ్చాలి? అనే అంశాన్ని నేర్పించాలని భావిస్తున్నట్లు తెలిపింది.

‘నేను కోస్టారికా నుంచి తిరిగి వచ్చాక నా జీవితంలో ప్రతి విషయంలోనూ సంతోషంగా ఉన్నాను. నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. ప్రతీది నాకు నచ్చినట్లుగా చేస్తున్నాను. నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకున్నాను. మంచి వ్యక్తి కావాలని తలిచాను. వారం రోజుల తరువాత అలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికాడు. నేను తంత్ర యోగా నేర్చుకున్నాను. ఇది శ్వాసపై దృష్టి కేంద్రీకరించే ఒక టెక్నిక్. ఇది శారీరకంగా కలవకుండానే భావప్రాప్తిని చేరుకోవడం నేర్పింది. శృంగారం సమయంలో భాగస్వామితో గానీ, ఒంటరిగా కూడా భావప్రాప్తిని పొందవచ్చు. ఇది నాకు కొత్త ప్రపంచాన్ని చూపించింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మెరుగైన లైంగిక జీవితాన్ని కలిగి ఉన్నాను. మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలంటే ప్రతి ధ్యానం చేయాలి. శ్వాసను ప్రాక్టీస్ చేయాలి.’ అని వోంక్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..