Indian Railways: రన్నింగ్ ట్రైన్ నుంచి ఫోన్, పర్స్ పడిపోతే వెంటనే ఈ పని చేయండి.. పోయిన వస్తువులు తెచ్చిస్తారు..!
భారతదేశం నలుమూలలకూ ట్రైన్ సదుపాయం ఉంది. రైల్వే వ్యవస్థ ఇంకా విస్తరిస్తూనే ఉంది. రైళ్లలో రోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వేలు ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఎల్లప్పుడూ కొత్త చర్యలు తీసుకుంటుంది.
భారతదేశం నలుమూలలకూ ట్రైన్ సదుపాయం ఉంది. రైల్వే వ్యవస్థ ఇంకా విస్తరిస్తూనే ఉంది. రైళ్లలో రోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వేలు ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఎల్లప్పుడూ కొత్త చర్యలు తీసుకుంటుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తమ ఫోన్‌లను ఉపయోగించడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే చాలాసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణిస్తున్న సమయంలో రైలు నుంచి మొబైల్, పర్సు, వాచ్ వంటి విలువైన వస్తువులు పడిపోతుంటాయి. అది చూసి ప్రజలు బాధపడుతారు.
సాధారణంగానే అందరూ బ్యాంకింగ్ వివరాలు మొదలు.. ముఖ్యమైన IDలు, ఇతర అనేక అంశాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఫోన్‌లోనే సేవ్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ ఎక్కడో పడిపోయినా? పోగొట్టుకున్నా? చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే, ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ రైల్వే కొన్ని సౌకర్యాలను కల్పించింది. దీని సహాయంతో మీరు కోల్పోయిన వస్తువును తిరిగి పొందవచ్చు. మరి పోగొట్టుకున్న వస్తువులను ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
పోయిన సామాను నేను ఎలా కనుగొనాలి..
ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే.. ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో వ్రాసిన నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్, వస్తువు ఏ రెండు రైల్వే స్టేషన్ల మధ్య పడిపోయిందో గమనించాలి. ఇతరుల ఫోన్ తీసుకుని రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 182 లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, మీ పోయిన ఫోన్, లగేజీ గురించి కంప్లైంట్ ఇవ్వాలి.
అదే సమయంలో మీరు గుర్తించిన పోల్ నంబర్‌ను RPFకి ఇవ్వాలి. ఈ పోల్ నంబర్ మీ వస్తువులను, ఫోన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. పోల్ నంబర్ సహాయంతో పోలీసులు మీరు పేర్కొన్న ప్రదేశానికి చేరుకుంటారు. మీ మొబైల్ ఫోన్, పర్సు లేదా వాచ్ కనుగొంటారు. పోలీసులు ప్రయత్నం మాత్రమే చేస్తారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. పోయిన వస్తువులు ఖచ్చితంగా దొరుకుతాయని పోలీసులు హామీ ఇవ్వలేరు. అంటే, ఈలోగా ఎవరైనా మీ లగేజీని ఎత్తుకెళితే పోలీసులు ఏమీ చేయలేరు.
అలారం చైన్ లాగొచ్చా?
అధికారిక సమాచారం ప్రకారం.. ట్రైన్ చైన్ లాగడం నేరం. కానీ కొన్ని పరిస్థితులలో చైన్ లాగొచ్చు. మీతో ప్రయాణిస్తున్న పిల్లలు, వృద్ధులు రైల్వే స్టేషన్‌లో వెనుకబడి ఉంటే చైన్ లాగొచ్చు. వికలాంగుడిని స్టేషన్‌లో వదిలి రైలు కదిలినప్పుడు కూడా చైన్ లాగొచ్చు. ఇవి కాకుండా.. రైలులో మంటలు, దోపిడీ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో చైన్‌ను లాగేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..