Weight Loss Tips: బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా?.. 80/20 డైట్ ప్లాన్‌తో కేవలం వారంలో స్లిమ్‌గా మారొచ్చు..

నేటి కాలంలో మన తప్పుడు జీవనశైలి కారణంగా చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.

Weight Loss Tips: బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా?.. 80/20 డైట్ ప్లాన్‌తో కేవలం వారంలో స్లిమ్‌గా మారొచ్చు..
Weight Loss
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2022 | 5:53 PM

బెల్లీ ఫ్యాట్ కారణంగా మీ ఫిగర్ క్షీణించినట్లయితే చింతించకండి. కొన్ని చర్యలతో మీరు మళ్లీ నాజుగ్గా మారొచ్చు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకుంటే పొట్ట ఉబ్బిపోతుంది. ఈ అలవాటును మార్చుకోండి. ప్రతి 2 నుంచి 3 గంటలకు తక్కువ మొత్తంలో కొద్దిగా మాత్రమే తినండి. ఎప్పుడూ తొందరపడి, వేగంగా తినకూడదు. అతిగా తినడం ఇవాళ్టి నుంచే మానుకోండి. హెల్త్ లైన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, ఉదయం బ్రష్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి త్రాగాలి. కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ఇలాంటి వ్యాయామంతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రయోగంతో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

ప్రతిరోజూ దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా.. మీరు కూడా శక్తివంతంగా ఉంటారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలకు మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిది. మార్నింగ్ వాక్ క్రమంగా ఊబకాయాన్ని తగ్గిస్తుంది. దీనితో పాటు జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

యోగా కూడా ప్రయోజనకరం

యోగా గురువులు చెప్పినట్లుగా, యోగా మీ మానసిక , శారీరక సమస్యలను దూరం చేస్తుంది. రోజూ నౌకాసనం చేయడం వల్ల మీ పొట్టలోని కొవ్వు ఆటోమేటిక్‌గా మాయమవుతుంది. మీరు తేడాను అతి కొద్ది రోజుల్లోనే గుర్తించవచ్చు. రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటును మానుకోండి. నిద్రవేళకు 2 గంటల ముందు తినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనానికి తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోండి. మీకు సమయం దొరికితే రాత్రి భోజనం చేసిన తర్వాత నడకకు వెళ్లడం అలవాటు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గించే చిట్కాలు:

పెరుగుతున్న బరువును నియంత్రించడానికి ఈ రోజుల్లో అనేక రకాల ఆహార ప్రణాళికలు వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒకటి 80/20 డైట్ ప్లాన్, 80/20 డైట్ ప్లాన్ ఈ నియమాన్ని అనుసరించడం ద్వారా బరువును సులభంగా నియంత్రించవచ్చని పేర్కొంది. చాలా మంది ప్రముఖ హాలీవుడ్ నటీమణులు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అంటే స్థూలకాయాన్ని నియంత్రించుకోవడానికి ఈ డైట్ ప్లాన్‌ను అనుసరిస్తారు. మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే.. పెరుగుతున్న బరువును నియంత్రించాలనుకుంటే 80/20 డైట్ ప్లాన్‌ను అనుసరించండి.

80/20 డైట్ ప్లాన్ అంటే ఏంటి?

హెల్త్ లైన్ ప్రకారం, 80/20 డైట్ ప్లాన్ 80 శాతం ఆరోగ్యకరమైన ఆహారాలను తినడాన్ని అలవాటు చేసుకోవడం. దీంతో పాటు 20 శాతం ఇష్టమైనవి కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఉండాలి. పాల ఉత్పత్తులు, నూనె,తీపి ఉత్పత్తులు తీసుకోవడం 20 శాతం తగ్గించాలి. అందుకే ఈ ప్లాన్‌ని 80/20 డైట్ ప్లాన్ అంటారు. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి తన ఆహారంలో 80 శాతం పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ నుంచి తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సీఫుడ్ కూడా చేర్చవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

80/20 డైట్‌తో ప్రయోజనాలు

సర్టిఫైడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ చెప్పినట్లుగా, ఈ ఆహారాన్ని అనుసరించడం చాలా సులభం. ఇందులో ఎలాంటి పరిమితి లేదు. 80/20 డైట్ ప్లాన్ లో అన్నీ తినే స్వేచ్ఛ ఉంది. కేలరీలు,కార్బోహైడ్రేట్లను కూడా లెక్కించాల్సిన అవసరం లేదు. అలాగే డైట్ పాటించడం వల్ల అధిక కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆహార ప్రణాళికలో, ఫైబర్, ప్రోటీన్లపై దృష్టి పెట్టాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా బరువు పెరగడాన్ని సులభంగా నియంత్రించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం