పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఐరన్, కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరతో రకరకాల వంటకాలు చేయవచ్చు. పాలకూరను కూరగానే కాకుండా పకోడీలు కూడా చేసుకుని తినొచ్చు. సాయంకాలం పూట వేడి వేడి పాలకూర పకోడిలు చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. టెస్ట్‌కి టెస్టీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జడివాడలో వేడి వేడి పకోడీలు చేసుకుని తింటే ఆ మజానే వేరు. ఈ పాలకూర పకోడీలను చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ఈ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.