Head Massage Benefits : హెడ్ మసాజ్ తో అమేజింగ్ లాభాలు.. వీటన్నింటికీ చెక్ పెట్టండి!!

హెడ్ మసాజ్ తో అన్నీ ఇన్నీ లాభాలు లేవండోయ్. హెడ్ మసాజ్ చేస్తే ఎంతో హాయిగా.. రిలాక్స్ గా ఉంటుంది. తల భారం, స్ట్రెస్ తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే మాడుకు కూడా రక్త ప్రసరణ కూడా బాగా జరిగి జుట్టు బాగా ఎదుగుతుంది. అందులోనూ గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే.. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ముఖ్యంగా జీవ కణాలను, నరాలను విశ్రాంతి పరుస్తుంది. హెడ్ మసాజ్ చేసుకోవడానికి స్పాలుకు..

Head Massage Benefits : హెడ్ మసాజ్ తో అమేజింగ్ లాభాలు.. వీటన్నింటికీ చెక్ పెట్టండి!!
Head Massage
Follow us

|

Updated on: Aug 16, 2023 | 9:03 PM

హెడ్ మసాజ్ తో అన్నీ ఇన్నీ లాభాలు లేవండోయ్. హెడ్ మసాజ్ చేస్తే ఎంతో హాయిగా.. రిలాక్స్ గా ఉంటుంది. తల భారం, స్ట్రెస్ తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే మాడుకు కూడా రక్త ప్రసరణ కూడా బాగా జరిగి జుట్టు బాగా ఎదుగుతుంది. అందులోనూ గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే.. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ముఖ్యంగా జీవ కణాలను, నరాలను విశ్రాంతి పరుస్తుంది. హెడ్ మసాజ్ చేసుకోవడానికి స్పాలుకు, సెలూన్స్ కు వెళ్లాలనే కాదు.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

తలనొప్పి తగ్గిస్తుంది:

తల మసాజ్ చేసుకోవడం వల్ల.. హెడ్ మసాజ్ వల్ల తలలోని కొన్ని నరాలు రిలాక్స్ అవుతాయి. కాబట్టి తలనొప్పి తగ్గుతుంది. అలాగే మనసు తేలిక పడుతుంది.

ఇవి కూడా చదవండి

చుండ్రుకు చెక్:

అప్పుడప్పుడు తలకు గోరువెచ్చని నూనెలో మసాజ్ చేయడం వలన.. చుండ్రు సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉన్న వారు తరచూ మసాజ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య దూరమవుతూ ఉంటుంది. అలాగే శిరోజాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

జుట్టు షైనీ:

తలకు తరచూ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటూ.. మెరుస్తూంటాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. అలాగే చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ సహాయపడుతుంది.

కుదుళ్లకు పోషణ:

తలకు బాద, కొబ్బరి, జోజోబా నూనెలతో మసాజ్ చేస్తే.. జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. మసాజ్ కారణంగా రక్త ప్రసరణ సాఫీగా జరిగి.. కుదుళ్లు మంచి పోషణ లభిస్తుంది. తరచుగా తలకు మర్దన చేయడం ద్వారా జుట్టు కూడా ఎదుగుతుంది.

ఫేస్ గ్లో:

తలకు మర్దన చేయడం ద్వారా మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. మసాజ్ తో మాడుపై ఉండే నరాలకు ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీని కారణంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ముఖంలో గ్లో పెరుగుతుంది.

నిద్రలేమి సమస్య తగ్గుతుంది:

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి హెడ్ మసాజ్ మంచిగా పని చేస్తుంది. రాత్రి వేళలో పడుకునే ముందు తలకు కాసేపు నెమ్మదిగా మసాజ్ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. గోరు వెచ్చని నూనెతో సున్నితమైన మసాజ్ చేసుకోవడం వల్ల మంచిగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి