Health: వైద్య రంగంలో అద్భుతం సోనోసైట్‌ పీఎక్స్‌ ఫొటో మెషిన్‌.. రోగ నిర్ధారణలో కీలక పాత్ర.

వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ సోనోసైట్ px ఫొటో మెషిన్‌. రోగ నిర్ధారణలో ఈ పరికరం కీలకపాత్ర పోషిస్తోంది. అత్యంత స్పష్టతతో కూడిన ఫొటోలను అందిస్తుందీ మెషిన్‌. దీని సహాయంతో వైద్యులు రోగ నిర్ధారణను సులువుగా చేయొచ్చు. అటు వైద్యులతో పాటు రోగుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది...

Health: వైద్య రంగంలో అద్భుతం సోనోసైట్‌ పీఎక్స్‌ ఫొటో మెషిన్‌.. రోగ నిర్ధారణలో కీలక పాత్ర.
Sonosite Px
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Sep 26, 2024 | 6:46 PM

వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ సోనోసైట్ px ఫొటో మెషిన్‌. రోగ నిర్ధారణలో ఈ పరికరం కీలకపాత్ర పోషిస్తోంది. అత్యంత స్పష్టతతో కూడిన ఫొటోలను అందిస్తుందీ మెషిన్‌. దీని సహాయంతో వైద్యులు రోగ నిర్ధారణను సులువుగా చేయొచ్చు. అటు వైద్యులతో పాటు రోగుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. ఫొటోలు తీసే సమయంలో మెరుగైన ఫలితాలు ఇచ్చేందుకు ఈ మిషిన్‌లో ఫిజికల్‌ కంట్రోల్‌ను మిళితం చేసే సామర్థ్యం కల్పించారు. ఇందులోని అడాప్టబుల్ ఆప్షన్‌తో సమాంతరంగా లేదా నిలువుగా ఉండే ఉపరితలాలలోనూ సమర్ధవంతంగా, నాణ్యతతో కూడిన ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

సానోగ్రాఫిక్‌ లాడ్మార్లకు మరింత దృశ్యరూపం ఇవ్వడానికి, ఫొటో క్లారిటీ కోసం ఈ మెషిన్‌ను గ్లౌజ్‌లు, స్టెరైల్ డ్రేప్ లతో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ మిషన్‌ ద్వారా విడుదలయ్యే అత్యధిక ఫ్రీక్వెన్సీ కారణంగా హై రిజల్యూజన్‌తో కూడిన ఫొటోలను అందిస్తుంది. ఈ మిషన్‌లోని T8-3 ట్రాన్సెస్సోఫాగియల్‌ ట్రాన్స్‌డసర్‌ గుండె చికిత్స సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పేషెంట్‌ శరీరంలో రక్త ప్రవాహాన్ని అంచనా వేయడానికి, శరీరంలోని వాపులను చూడడానికి ఉపయోగపడుతుంది.

ఈ మిషన్‌లోని అడాప్టబుల్ వర్క్ ఆప్షన్.. ఉపరితలం నిలువు లేదా సమాంతరంగా ఉన్నా అనుకూలంగా ఉంటుంది. ఫొటో ప్రొటెక్షన్‌ కోసం ప్రత్యేకటమైన బటన్లతో కూడిన టచ్‌ ప్యానెల్‌ ఇచ్చారు. కొన్ని రకాల ఇబ్బందులను అధిగమించి పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మిషన్‌ పరిమాణంలోనూ చిన్నగా ఉండడం వల్ల రద్దీగా ఉండే కారిడార్లతో పాటు… ఆసుప్రతిలోని బెడ్స్‌ కింద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..