TSPSC Answer Key: టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఆగస్టు 25 వరకు అభ్యంతరాల స్వీకరణ
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓ, మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సన్ 'కీ' విడుదల సోమవారం (ఆగస్టు 21) విడుదలైంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని కమిషన్ వెబ్‌సైట్ tspsc.gov.in. లో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు..
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓ, మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సన్ ‘కీ’ విడుదల సోమవారం (ఆగస్టు 21) విడుదలైంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని కమిషన్ వెబ్‌సైట్ లో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీయస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలు లేవనెత్తేవారు ఆగస్టు 23 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తెలియజేస్తూ ఓ ప్రకటనను కమిషన్ వెబ్‌సైట్లో పెట్టింది.
కాగా మొత్తం 78 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలసిందే. ప్రాథమిక ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్‌కీ విడుదల చేస్తారు. అనంతరం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తారు.
ఆగస్టు 30, 31 తేదీల్లో ఐటీఐ మూడో విడత కౌన్సెలింగ్
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలోని కరెన్సీనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ఆగస్టు 30, 31 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఎం కనకారావు సోమవారం (ఆగస్టు 21) ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 28వ తేదీలోగా సంబంధిత కాలేజీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీన ప్రభుత్వ ఐటీఐలో, ప్రైవేటు ఐటీఐలో చేరే వారు ఆగస్టు 31న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 94906-39639, 7780429468 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.