TSPSC Gurukul Exams: రేపటితో ముగుస్తోన్న గురుకుల టీచర్ నియామక పరీక్షలు.. సగటున 75 శాతం హాజరు నమోదు
ఆగస్టు 21న టీసీఎస్‌అయాన్ సంస్థ డేటాసెంటర్‌లో జరిగిన పీజీటీ గురుకుల పరీక్షలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. నిన్న సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి విడత జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష సమయానికి కేంద్రాల్లోకి అనుమతించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. 10.30 గంటలకు సమస్య పరిష్కారమవడంతో ఉదయం పదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమైంది. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్ష కొన్ని కేంద్రాల్లో అరగంట నుంచి 45 నిమిషాలు ఆలస్యంగా జరిగింది. టీసీఎస్‌అయాన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఈ సంస్థకు సంబంధించిన..
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో (సీబీఆర్‌టీ) రాత పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్టుల ప్రకారం జరగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు ఇప్పటివరకు సగటున 75 శాతానికిపైగా అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక గురుకుల టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు బుధవారం (ఆగస్టు 23)తో ముగియనున్నాయి. ఆ తరువాత నియామకాలకు సంబంధించిన ప్రక్రియను కూడా త్వరగా పూర్తిచేసేందుకు గురుకుల బోర్డు సమాయాత్తమవుతోంది.
కాగా ఆగస్టు 21న టీసీఎస్‌అయాన్ సంస్థ డేటాసెంటర్‌లో జరిగిన పీజీటీ గురుకుల పరీక్షలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. నిన్న సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి విడత జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష సమయానికి కేంద్రాల్లోకి అనుమతించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. 10.30 గంటలకు సమస్య పరిష్కారమవడంతో ఉదయం పదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమైంది. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్ష కొన్ని కేంద్రాల్లో అరగంట నుంచి 45 నిమిషాలు ఆలస్యంగా జరిగింది. టీసీఎస్‌అయాన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఈ సంస్థకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తినట్లు బోర్డు తెల్పింది. మధ్యాహ్నం పరీక్ష కొన్ని కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభనప్పటికీ అభ్యర్థులు సమయం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక సాయంత్రం విడత పరీక్ష మాత్రం ప్రకటించిన సమయానికే ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అపోహలకు, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సాంకేతిక సమస్య కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.
దోస్త్‌లో మరో 2 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల చేరిక
ఇటీవల మంజూరైన డిచ్‌పల్లి, బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లను దోస్త్ రెండో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంకి సంబంధించి 8 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మంజూరుకాగా, వీటిల్లో ఇప్పటికే 6 కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మంజూరైన రెండు కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ఆగస్టు 28వ తేదీ నుంచి జరిగే దోస్త్ రెండో ప్రత్యేక విడతలో ప్రవేశాలు జరుపుతామని ఆయన తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 147కి చేరింది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.