Telangana: గురుకుల పోస్టుల ఫలితాలు వచ్చేది అప్పుడే.. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి ఇటీవల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఫలితాలు ఈ నెలఖరులోగా విడుదలకానున్నాయి. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ రాతపరీక్షలు 23వ తేదీ వరకు సుమారు 19 పనిరోజులు జరిగాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తానికి 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో ప్రతిరోజూ మూడుషిప్లుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామక బోర్డు నిర్వహించింది.

Telangana: గురుకుల పోస్టుల ఫలితాలు వచ్చేది అప్పుడే.. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి
Ts Gurukul Teacher
Follow us

|

Updated on: Aug 24, 2023 | 6:50 AM

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి ఇటీవల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఫలితాలు ఈ నెలఖరులోగా విడుదలకానున్నాయి. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ రాతపరీక్షలు 23వ తేదీ వరకు సుమారు 19 పనిరోజులు జరిగాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తానికి 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో ప్రతిరోజూ మూడుషిప్లుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామక బోర్డు నిర్వహించింది. వీటికి సగటున దాదాపు 75.68 శాతం మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని బోర్టు కార్యనిర్వహణ అధికారి మల్లయ్య బట్టు తెలిపారు. పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలు.. ముఖ్యంగా ప్రాథమిక కీ ని వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తెలియజేశారు. అభ్యర్థులు తమ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి సమాధానాలు సరిచూసుకోవాలని చెప్పారు.

అలాగే ప్రాథమిక కీ పై కూడా ఏమైన అభ్యంతరాలు ఉంటే గడువు తేదీలోగా తెలిపాలని సూచనలు చేశారు. అభ్యంతరాలు అనేవి లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని.. ఒకవేళ ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వకంగా అభ్యంతరలా చేస్తే స్వీకరించమని పేర్కొన్నారు. గురుకుల నియామక బోర్డు ఆగస్టు 3 నుంచి 19 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలు వెబ్‌సైట్లోని వ్యక్తిగత లాగ్‌న్‌లో బుధవారం రోజున పొందుపరిచింది. అయితే ఈ ప్రాథమిక కీ పై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 25వ తేదీ సాయంత్రం లోగా పంపాల్సి ఉంటుంది. 21,22,23 వ తేదీల్లో జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ గురువారం మధ్యాహ్నానికి అందుబాటులో ఉంటాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై ఆగస్టు 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా ఆగస్టు 1వ తేదీన జరిగిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పరీక్షలపై న్యాయవివాదం నెలకొంది. ఇది పరిష్కారమైన తర్వాత వాటి ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాల్ని బోర్టు పొందుపరచనుంది. అలాగే ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తీసుకొని.. వాటిని పరిశీలించి రెండు రోజుల్లోగా చివరి కీ లను బోర్టు ప్రకటించునున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా ఈ బోర్డు వెల్లడించనుంది. ఉన్నతస్థాయి పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు అవరోహణ క్రమంలో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ముందుగా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పూర్తి చేసి ఆ తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అయితే అక్టోబర్ నెల చివరి నాటికి నియామాకాలన్నింటిని పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.