NLC India Recruitment 2023: రాత పరీక్షలేకుండా నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన 56 ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

NLC India Recruitment 2023: రాత పరీక్షలేకుండా నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
NLC India Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2023 | 1:00 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన 56 ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్‌ 22, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు కొనసాగే ట్రైనింగ్ ప్రోగ్రాంలో నెలకు రూ.22,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • నైవేలీ యూనిట్స్‌లో ఖాళీలు: 23
  • కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఖాళీలు: 7
  • బర్సింగ్‌సర్‌ ప్రాజెక్ట్‌లో ఖాళీలు: 3
  • ఎన్టీపీఎల్‌/ట్యూటికోరిన్లో ఖాళీలు: 6
  • ఎన్‌యూపీపీఎల్‌, కాన్పూర్‌లో ఖాళీలు: 5
  • రిజనల్ ఆఫీస్‌/చెన్నైలో ఖాళీలు: 2
  • రిజనల్ ఆఫీస్‌/చెన్నై-కమర్షియల్‌లో ఖాళీలు: 2
  • రిజనల్ ఆఫీస్‌/న్యూఢిల్లీలో ఖాళీలు: 2
  • తలబిర ప్రాజెక్ట్‌లో ఖాళీలు: 4
  • సౌత్‌ పచ్వారా-దుమ్కాలో ఖాళీలు: 2

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.