Exam Preparation Tips: ఇలా చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం పక్కా.. ఎటువంటి కోచింగ్ లేకపోయినా కొట్టేయొచ్చు..
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నారా? వేలకువేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లే అవకాశం లేదా? అయితే ఈ కథనం మీ కోసమే.. ఇంట్లోనే ఉండి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సులభంగా కొట్టగల బెస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఇక్కడ ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు.
గవర్నమెంట్ ఉద్యోగం.. ప్రతి డిగ్రీ హోల్డర్ లక్ష్యం ఇదే. దాని కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగమే ఎందుకు? అనే ప్రశ్న అందరికీ సాధారణ వస్తుంది. అయితే దానికి ప్రధాన కారణం భద్రత, స్థిరత్వం. అయితే ప్రభుత్వం ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పోటీని అధిగమించాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. అందరూ కష్టపడతారు. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి చదువుతారు. అయితే విజయం కొందరినే వరిస్తుంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్లానింగ్. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కచ్చితమైన ప్రణాళిక ఉండాల్సిందే. లేకుంటే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం నిపుణులు అందిస్తున్న కొన్ని ప్రిపరేషన్ టిప్స్.. చదివేయండి..
పరీక్ష నమూనా.. అన్ని పోటీ పరీక్షలు ఒకేలా ఉండవు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ పరీక్షా సరళి, సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. అందుకోసం నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష నిర్వహణ తీరును అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా కనుగొనవచ్చు.
ప్లానింగ్.. మీ ప్రిపరేషన్ ను తెలివిగా ప్లాన్ చేసి అమలు చేయాలి. ఒక స్టడీ ప్రణాళికను సిద్ధం చేసి అనుసరించాలి. మీ సమయాన్ని సమానంగా విభజించాలి. తద్వారా మీరు ఏ ఇతర అంశాన్ని పట్టించుకోకుండా మొత్తం సిలబస్‌పై దృష్టి పెట్టవచ్చు.
స్టడీ మెటీరియల్ .. ప్రభుత్వ ఉద్యోగాలకు ఖరీదైన కోచింగ్ అవసరం లేదు. మీరు పరీక్షా సరళి, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న తర్వాత, ప్రిపరేషన్ కు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ నుంచి అవసరమైన వాటిని డౌన్లోడ్ చేసుుకోవాలి. అందుబాటులో ఉన్న లైబ్రరీని వాడుకోవాలి. మీ అవకాశం ఉన్న ప్రతి సోర్స్ నుంచి ప్రిపరేషన్ కు అవసరమైన మెటీరియల్ ను సంపాదించుకోవాలి.
గత ప్రశ్నపత్రాలు.. ప్రశ్నల సరళి, సమయపాలనను అలవాటు చేసుకోవడానికి ఉత్తమ మార్గం గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయడం. మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, మాక్ టెస్ట్‌లు మీకు పరీక్ష సరళితో సుపరిచితం కావడానికి సాయపడతాయి. అలాగే మీ బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడతాయి.
సమయపాలన.. మీ సమయాన్ని తెలివిగా, సమర్ధవంతంగా నిర్వహించడం చాలా కీలకం. మీరు రోజుకు పది గంటల పాటు చదువుకోవచ్చు. అయితే మూడు గంటల రెగ్యులర్ స్టడీ ఉన్న ఎవరైనా ఏ పరీక్షలోనైనా రాణించగలరు. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, పరధ్యానాన్ని నివారించడం నేర్చుకోండి.
రివిజన్.. మీరు సంబంధిత రిక్రూట్‌మెంట్ పరీక్ష మొత్తం సిలబస్‌ను కవర్ చేసిన తర్వాత, తిరిగి రివిజన్ చేసుకోవడం ముఖ్యం. దీని ద్వారా మెమరీ షార్ప్ అవుతుంది.
సానుకూల దృక్పథం.. మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, దాని పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. నేను సాధించగలను అనే నమ్మకాన్ని ఏర్పరచుకోండి. దానిని సాధించడానికి కృషి చేయండి. అయితే ఈ ప్రక్రియలో మీరు సాధారణంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..