AP Edcet 2023 Notification: ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె రాజేంద్రప్రసాద్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె రాజేంద్రప్రసాద్ సూచించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్‌సెట్ ప్రవేశాలను నిర్వహిస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్ధులకు రూ.650, బీసీ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.450లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.1000ల ఆలస్య రుసుముతో మే 2 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు మే 12 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EDCET 2022) పరీక్ష మే20 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ మే 24న విడుదల చేస్తారు. బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాల కోసం అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.