SSC Exams 2023: విద్యార్థులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం..
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఎస్ఎస్‌సీ బోర్డులు పకడ్బంధీ ఏర్పాట్ుల చేశాయి. కేంద్రాల్లో వద్ద పోలీసులను మోహరించడంతోపాటు.. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవక్షణలో పకడ్బంధీగా పరీక్షలు జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఎస్ఎస్‌సీ బోర్డులు పకడ్బంధీ ఏర్పాట్ుల చేశాయి. కేంద్రాల్లో వద్ద పోలీసులను మోహరించడంతోపాటు.. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవక్షణలో పకడ్బంధీగా పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుంచి ఏప్రిల్ 18 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం 12.45 నిముషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల కోసం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం పరీక్ష రాయనున్న విద్యార్ధుల సంఖ్య 6,64,152, సప్లమెంటరీ విద్యార్థుల సంఖ్య 53,410.. వారిలో బాలురు 3,11,329, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల ఎ కేటగిరిలో 1,342, బి కేటగిరిలో 1,325, సి కేటగిరిలో 682 సెంటర్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు.. విధుల్లో 156 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. కంట్రోల్ రూం ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్ధుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులను సైతం నడిపిస్తున్నారు.
తెలంగాణలో..
తెలంగాణ వ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 144 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9:35 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో 76.5 శాతం మంది ఇంగ్లిష్ మీడియానికి చెందిన విద్యార్తులుండటం విశేషం. ఈ పరీక్షలు అన్ని మాధ్యమాల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పదవ తరగతి విద్యార్ధుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులను సైతం నడిపించడంతోపాటు.. విద్యార్థుల హాల్ టికెట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..