TVS Electric Scooter: దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. కిర్రాక్ లుక్‌లో కేక పెట్టిస్తున్న హైస్పీడ్ వేరియంట్..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు టీవీఎస్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో పలు టీజర్లను దీనిపై విడుదల చేసిన సంస్థ ఎట్టకేలకు దానిని పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీని పేరు టీవీఎస్ ఎక్స్. ధర రూ. 2.50లక్షలుగా ఉంది. హై స్పీడ్ స్కూటర్ గా కంపెనీ దీనిని ఆవిష్కరించింది.

TVS Electric Scooter: దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. కిర్రాక్ లుక్‌లో కేక పెట్టిస్తున్న హైస్పీడ్ వేరియంట్..
Tvs X Electric Scooter
Follow us

|

Updated on: Aug 24, 2023 | 11:41 AM

విద్యుత్ శ్రేణి వాహనాలకు ఏర్పడుతున్న డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఒకదానికి మంచి మరొకటి సరికొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు టీవీఎస్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో పలు టీజర్లను దీనిపై విడుదల చేసిన సంస్థ ఎట్టకేలకు దానిని పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీని పేరు టీవీఎస్ ఎక్స్. ధర రూ. 2.50లక్షలుగా ఉంది. హై స్పీడ్ స్కూటర్ గా కంపెనీ దీనిని ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలుస్తోంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే సింగిల్ చానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది కలిగిన మొదటి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం. ఇది గరిష్టంగా 11 కిలోవాట్ల శక్తిని అందిస్తుంది. దీని డిజైన్ మాత్రం దాదాపు క్రెయాన్ మోడల్లోనే ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీవీఎస్ ఎక్స్ స్పెసిఫికేషన్లు..

ఈ స్కూటర్లో 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని స్మార్ట్ ఎక్స్ హోమ్ ర్యాపిడ్ చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే సున్నా నుంచి 50శాతం బ్యాటరీ కేవలం 50 నిమిషాల్లోనే చార్జ్ అవుతుంది. అంతేకాక 950వాట్ల పోర్టబుల్ చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సున్నా నుంచి 80శాతం బ్యాటరీ చార్జ్ అవడానికి నాలుగున్నర గంటలు సమయం తీసుకుంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టెలీస్కోపింగ్ ఫోర్క్, మోనోషాక్ అబ్జర్బర్ ఉంటాయి. దీనిలో ని మోటార్ 11కేడబ్ల్యూ, 40ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముందూ వెనుక డిస్క్ బ్రేకులు అమర్చారు.

ఫీచర్లు ఇవి..

దీనిలో అత్యాధునిక ఫీచర్ ఏబీఎస్(అల్బీట్ ఎ సింగిల్ చానల్ సిస్టమ్)ఉంటుంది. ఇది కలిగిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. ఈ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ లెటన్ ప్లాట్ ఫారం పై మ్యాక్సీ స్టైల్ ఫార్మేట్ లో తయారు చేశారు. ఇది కేవలం 2.6 సెకన్లలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఈ టీవీఎస్ ఎక్స్ కొత్త స్కూటర్ ధర రూ. 2.50 లక్షలు(ఎక్స్ షోరూం, బెంగళూరు)గా ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదే ఖరీదైన స్కూటర్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 సబ్సిడీ కూడా లేకపోవడంతో ధర ఎక్కువైంది. దీనికి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ 2023 నాటికి బెంగళూరులో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా డెలివరీలు అందిస్తారు. దీనిని ప్రీ బుక్ చేసుకున్న మొదటి 2000 మంది వినియోగదారులకు స్మార్ట్ వాచ్, క్యూరేటెడ్ కాన్సీర్జ్ ఉచితంగా అందిస్తారు. వీటి విలు రూ. 18,000 వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..