Kinetic Luna: 50 ఏళ్ల క్రితం వచ్చిన లూనా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో..
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్నీ ఆటో కంపెనీలు తమ వాహనాల శ్రేణిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చూసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ప్రజల మనస్సులు గెలుచుకుని టెక్నాలజీ పోటీలో వెనుకబడి..
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్నీ ఆటో కంపెనీలు తమ వాహనాల శ్రేణిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చూసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ప్రజల మనస్సులు గెలుచుకుని టెక్నాలజీ పోటీలో వెనుకబడి ప్రొడక్షన్ నిలిచిపోయిన కొన్ని వాహనాలు మళ్ళీ కొత్త రూపంతో ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలోనే బజాజ్ కంపెనీ చేతక్ తాజగా ఎలక్ట్రిక్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎల్ఎంఎల్ కూడా ఎలక్రిక్ రపంలో మళ్ళీ రాబోతోంది.
ఇక ఇప్పుడు 80-90 దశకాలలో ఒక సంచలనంగా నిలిచిన కైనెటిక్ లూనా మళ్ళీ కొత్త లుక్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారి ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ గా రంగప్రవేశం చేస్తోంది. అప్పట్లో చల్ మేరీ లూనా క్యాప్షన్ తో పాప్యులర్ అయిన లూనా ఈ సారి E లూనా గా మార్కెట్లోకి తీసుకువస్తున్నామని కంపెనీ సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వానీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ లూనా తయారీ కోసం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఫ్యాక్టరీ సిద్ధం అయింది. ఇక్కడ నెలకు 5 వేల ఈ లూనాలు తయార్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
లూనా 50 సీసీ ఇంజన్ తో భారత్ లో తొలి మోపెడ్ గా 1972లో మార్కెట్లోకి వచ్చింది. వచ్చిన కొద్ది కాలంలోనే ఇది అందరి మనసులూ గెలుచుకుంది. ఆ తరువాత మార్కెట్లోకి ఎన్నో మోపెడ్ లు వచ్చినా లూనా టీఎఫ్‌ఆర్, డబల్ ప్లస్, వింగ్స్, మేగ్నం, సూపర్ వేరియంట్లతో మార్కెట్ ను ఒక ఊపు ఊపింది. ఈ మోపెడ్ వచ్చినపుడు దీని ధర రెండు వేల రూపాయలు. దాదాపు మూడు దశాబ్దాల పాటు మార్కెట్లో ఊపు ఊపిన లూనాను 2000 సంవత్సరంలో నిలిపివేశారు.
Kinetic Luna electric scooter launching soon, will be called ‘e Luna’ https://t.co/lKqS3D0kZu
— 91mobiles (@91mobiles) May 31, 2023
ఇక ఇప్పుడు ఈ లూనా ను కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ వవర్ సొల్యూషన్ ద్వారా మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. ఇది కూడా మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందని.. లూనా తొలి మోడల్ రూపకర్త పద్మశ్రీ అరుణ్ ఫిరోదియా వారసులు అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి