Aadhaar Card Update: ఆధార్‌ కార్డుదారులకు అలర్ట్‌.. జూన్ 14 వరకే అవకాశం.. లేకుంటే..

భారతదేశంలో చాలా ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డు ద్వారానే అనేక పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో అనేక సౌకర్యాలు పొందడానికి ఆధార్ కార్డును కూడా ఉపయోగిస్తారు. ప్రజలు తమ ఆధార్ కార్డును కూడా అప్‌డేట్..

Aadhaar Card Update: ఆధార్‌ కార్డుదారులకు అలర్ట్‌.. జూన్ 14 వరకే అవకాశం.. లేకుంటే..
Aadhaar Card
Follow us

|

Updated on: May 30, 2023 | 5:00 AM

భారతదేశంలో చాలా ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డు ద్వారానే అనేక పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో అనేక సౌకర్యాలు పొందడానికి ఆధార్ కార్డును కూడా ఉపయోగిస్తారు. ప్రజలు తమ ఆధార్ కార్డును కూడా అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితిలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 14 జూన్ 2023 వరకు ఆధార్ పత్రాల ఆన్‌లైన్ అప్‌డేషన్‌ను ఉచితంగా చేసింది. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి దాదాపు రూ.50 లేదా రూ.100 ఫీజు ఉంటుంది. అయితే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జనాభా వివరాలను అప్‌డేట్ చేయడం జూన్ 14 వరకు ఉచితం.

ఈ సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. భౌతిక ఆధార్ కేంద్రాలలో 50 రూపాయల ఛార్జీ కొనసాగుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. యూఐడీఏఐ ద్వారా వారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఆధార్‌ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తియిన తర్వాత కార్డులోని వివరాలు అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి చేసింది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?

  • ఆధార్ నంబర్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌ ద్వారా  లాగిన్ అవ్వండి.
  • ‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ ఎంపికను ఎంచుకోండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • దీని తర్వాత మీరు ‘డాక్యుమెంట్ అప్‌డేట్’పై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత, ఏదైనా అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.
  • చివరగా ‘సమర్పించు’ బటన్‌ను ఎంచుకోండి. పత్రాలను అప్‌డేట్ చేయడానికి, వాటి కాపీలను అప్‌లోడ్ చేయండి.
  • ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించబడుతుంది అలాగే 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించబడుతుంది.
  • అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని ఉపయోగించి ఆధార్ చిరునామా అప్‌డేట్ స్థితిని తనిఖీ చేయవచ్చు. అప్‌డేట్ చేసినప్పుడు, మీరు అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింటెడ్ ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి