Gold Price Today: పసిడి ప్రియులకు గూడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold and Silver Latest Prices: పసిడికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా మారుతున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి.
Gold and Silver Latest Prices: పసిడికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా మారుతున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి పసిడి, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 54,980, 24 క్యారెట్ల ధర 59,980 ఉంది. తులం బంగారంపై దాదాపు 20 మేర తగ్గింది. ఇదిలాఉంటే.. కేజీ వెండి ధర 77,700 మేర ఉంది.. రూ.200 మేర ధర పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,130 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,360, 24 క్యారెట్లు 60,390 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980 ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,980 గా ఉంది.
వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,700 గా ఉంది. ముంబైలో రూ.77,700, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో 77000 లుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.81,500 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు మంగళవారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..