Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold Price Today
Follow us

|

Updated on: Jul 29, 2023 | 6:25 AM

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. శనివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.350 మేర తగ్గి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 మేర తగ్గి రూ.60,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.2000 మేర తగ్గి రూ.76,400 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,260 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, బెంగళూరులో 22క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్ల ధర రూ.60,550 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24క్యారెట్ల ధర రూ.60,110 గా ఉంది.

వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది. ముంబైలో రూ.76400, చెన్నైలో రూ.79,500, బెంగళూరులో రూ.75,250, హైదరాబాద్ లో రూ.79,500, విజయవాడలో రూ.79,500, విశాఖపట్నంలో రూ.79,500 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..