Gold Price Today: ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా..?

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. అయితే, గత కొంతకాలం నుంచి పసిడి, వెండి ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే.

Gold Price Today: ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా..?
Gold Price
Follow us

|

Updated on: Aug 21, 2023 | 6:27 AM

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. అయితే, గత కొంతకాలం నుంచి పసిడి, వెండి ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు 60వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి. ఆ తర్వాత ధరలు కొంత మేర తగ్గి.. కొన్ని రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.54,100 గా ఉంటే.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,020 గా ఉంది. ఇదిలాఉంటే.. వెండి కిలో ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. పది గ్రాముల వెండి రూ.733గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,170 గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,020, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, బెంగళూరులో వెండి ధర రూ.72,500, కోల్‌కతాలో రూ.73,500 లుగా ఉంది. చెన్నైలో వెండి కిలో ధర రూ.76,500, కేరళలో రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి కిలో ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

గమనిక..

కాగా.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.