Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. గత కొంతకాలం నుంచి మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు 60వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price Today
Follow us

|

Updated on: Aug 20, 2023 | 6:26 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. గత కొంతకాలం నుంచి మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు 60వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి ధరలు స్వల్పంగా తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా పెళ్లిళ్లు, ఇళ్లల్లో శుభకార్యాలైనా, పండుగలు ఉన్నా.. చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారం, వెండి ధరలపై అందరూ ఓ కన్నేసి ఉంచుతూ తగ్గినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.73,300 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,170 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020 గా ఉంది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450
  • బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,020గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,020 లుగా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లు గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, కేరళలో రూ.76,500, బెంగళూరులో రూ.72,500, కోల్‌కతాలో రూ.73,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

గమనిక..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.