Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందో తెలుసా..?

Gold, Silver Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా 60 వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి. ఈ తరుణంలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది.

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందో తెలుసా..?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2023 | 6:27 AM

Gold, Silver Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా 60 వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి. ఈ తరుణంలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం (మే 24) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,100 గా ఉంది. తులం బంగారంపై రూ.300 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.74,500 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,580
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,100 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,500, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000, బెంగళూరులో రూ.78,000, కేరళలో రూ.78,000, కోల్‌కతాలో రూ.74,500, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,800, విజయవాడలో రూ.78,000, విశాఖపట్నంలో రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..